Telugu Global
Health & Life Style

అటుకులు ఇస్తాయి... శక్తి చిటికెలో....

గాడిద కేమి తెలుసు… అటుకుల రుచి… అన్న సామెత వినే ఉంటారు. అవును. నిజమే… అటుకులు రుచే కాదు. పోషకాలకు పెట్టింది పేరు. అటుకులు వంటిట్లో ఉండే సాధారణ తినుబండారం. దీనిని మనం ఏ రకంగా తీసుకున్నా కూడా ఆరోగ్యమే… అటుకుల పాయసం, ఉప్మా, చుడ్వా, బర్ఫీ… ఎలా చేసుకున్నా కూడా వాటిలోని పోషక విలువలు తగ్గవంటున్నారు వైద్య నిపుణులు. అటుకులకు పోహా అని, ఫ్లాటర్డ్ రైస్ (flattered rice) అని కూడా పేర్లున్నాయి. అటుకుల్లో విటమిన్ […]

అటుకులు ఇస్తాయి... శక్తి చిటికెలో....
X

గాడిద కేమి తెలుసు… అటుకుల రుచి… అన్న సామెత వినే ఉంటారు. అవును. నిజమే… అటుకులు రుచే కాదు. పోషకాలకు పెట్టింది పేరు. అటుకులు వంటిట్లో ఉండే సాధారణ తినుబండారం.

దీనిని మనం ఏ రకంగా తీసుకున్నా కూడా ఆరోగ్యమే… అటుకుల పాయసం, ఉప్మా, చుడ్వా, బర్ఫీ… ఎలా చేసుకున్నా కూడా వాటిలోని పోషక విలువలు తగ్గవంటున్నారు వైద్య నిపుణులు. అటుకులకు పోహా అని, ఫ్లాటర్డ్ రైస్ (flattered rice) అని కూడా పేర్లున్నాయి.

  • అటుకుల్లో విటమిన్ బి, కార్బొహైడ్రేట్స్, ప్రోటీన్లు, ఐరన్ ఉన్నాయి. ఇవి ఎన్నో ఆరోగ్య సమస్యలను నివారిస్తాయి.
  • వీటిలో ఉన్న పోషక విలువలు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. ఎనర్జీ లెవెల్స్ ని పెంచుతాయి.
  • అటుకులు త్వరగా జీర్ణం అయ్యే ఆహారం. డైటింగ్ చేస్తున్న వారికి అటుకులు మంచి ఆహారం.
  • అటుకులను పెరుగులో కలుపుకుని తింటే ఇతర పోషకాలు కూడా తోడై శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
  • ఉదయం తీసుకునే అల్పహారంలో అటుకులే బెస్ట్ బ్రెక్ ఫాస్ట్.
  • వీటిలో గ్లూకోజ్ గాని, కొవ్వు పదార్దాలు కాని అస్సలు ఉండవు. కాబట్టి ఇవి ప్రతిరోజూ తిన్నా కూడా ఆరోగ్యానికి హాని చేయవు.
  • అటుకులలో ఉన్న బి1 విటమిన్ రక్తంలో ఉన్న షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తాయి.
  • అటుకులు త్వరగా జీర్ణం అయి, మలబద్దకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
  • శరీరానికి తగు మోతాదులో క్యాలరీస్ అందించడంలో అటుకులు ఎంతో ఉపయోగపడతాయి.
  • అటుకులలో వేరుశనగ, గుల్ల సెనగపప్పు వంటివి కలపుకుని తింటే రోగ నిరోధక శక్తి పెరిగి శరీరానికి ఎక్కువ ప్రోటీన్లు అందుతాయి.
First Published:  13 April 2019 9:55 PM GMT
Next Story