Telugu Global
Cinema & Entertainment

మూడు సినిమాలతో సిద్ధం అవుతున్న నాని !

‘కృష్ణార్జున యుద్ధం’, ‘దేవదాసు’ సినిమాలతో డిజాస్టర్లు అందుకున్న నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘జెర్సీ’ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ‘మళ్లీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్న నూరి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందింది. అయితే నాని తదుపరి సినిమా ‘గ్యాంగ్ లీడర్’ అని తెలిసిన విషయమే. […]

మూడు సినిమాలతో సిద్ధం అవుతున్న నాని !
X

‘కృష్ణార్జున యుద్ధం’, ‘దేవదాసు’ సినిమాలతో డిజాస్టర్లు అందుకున్న నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘జెర్సీ’ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ‘మళ్లీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్న నూరి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదల కానుంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందింది. అయితే నాని తదుపరి సినిమా ‘గ్యాంగ్ లీడర్’ అని తెలిసిన విషయమే. టైటిల్ ఎనౌన్స్ మెంట్ వీడియో తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు నాని. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది.

అనుకున్న తేదీకి విడుదల చేయడం కోసం ఈ సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

ఇక ఈ సినిమా తరువాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్ కలిసి ఒక మల్టీస్టారర్ చేయనున్నారు. ఈ సినిమాకు ‘వ్యూహం’ అనే ఒక ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా షూటింగ్ కూడా త్వరగా పూర్తి చేసి ఈ సినిమాను డిసెంబర్ లో క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అంటే ఈ ఒక్క సంవత్సరంలోనే నాని మూడు సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నాడన్నామాట.

First Published:  10 April 2019 10:54 PM GMT
Next Story