Telugu Global
Cinema & Entertainment

జెర్సీలో క్రికెట్ మాత్రమే ఉండదు

తన అప్ కమింగ్ మూవీ జెర్సీపై ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు నాని. పోస్టర్లు, థీమ్ అంతా క్రికెట్ చుట్టూ నడుస్తుండడంతో దీన్నొక స్పోర్ట్స్ డ్రామాగా చూస్తున్నారు ప్రేక్షకులు. అయితే జెర్సీలో క్రికెట్ అనేది కేవలం థీమ్ అంటున్నాడు నాని. సినిమాలో ఓ నీడలా క్రికెట్ కనిపిస్తుందని, కథ మాత్రం వేరే విధంగా ఎమోషనల్ గా ఉంటుందని చెబుతున్నాడు. “జెర్సీలో నేను రంజీ ప్లేయర్ గా కనిపిస్తాను. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగిగా కూడా […]

జెర్సీలో క్రికెట్ మాత్రమే ఉండదు
X

తన అప్ కమింగ్ మూవీ జెర్సీపై ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు నాని. పోస్టర్లు, థీమ్ అంతా క్రికెట్ చుట్టూ నడుస్తుండడంతో దీన్నొక స్పోర్ట్స్ డ్రామాగా చూస్తున్నారు ప్రేక్షకులు. అయితే జెర్సీలో క్రికెట్ అనేది కేవలం థీమ్ అంటున్నాడు నాని. సినిమాలో ఓ నీడలా క్రికెట్ కనిపిస్తుందని, కథ మాత్రం వేరే విధంగా ఎమోషనల్ గా ఉంటుందని చెబుతున్నాడు.

“జెర్సీలో నేను రంజీ ప్లేయర్ గా కనిపిస్తాను. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగిగా కూడా నటించాను. స్పోర్ట్స్ కోటా కింద నాకు ఉద్యోగం వస్తుందన్నమాట. అంతా అనుకుంటున్నట్టు ఇది స్పోర్ట్స్ సినిమా కాదు. అదొక ఎలిమెంట్ మాత్రమే. సినిమా మొత్తం చాలా ఎమోషనల్ గా సాగుతుంది. క్రికెట్ అనేది ఓ షాడోలా మాత్రమే ఉంటుంది.”

ఇలా జెర్సీ సినిమాపై ఓ స్పష్టత ఇచ్చాడు నాని. 1986, 1996, 2018లో జరిగిన వివిధ సంఘటనలతో జెర్సీ సినిమా తెరకెక్కిందంటున్నాడు. అంటే ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉందనే విషయాన్ని పరోక్షంగా చెప్పాడు నాని. ఇందులో క్రికెట్ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని, అచ్చమైన క్రికెట్ చూస్తున్న భావన కలుగుతుందని చెబుతున్నాడు.

ఈ సినిమా ట్రయిలర్ ను 12వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఇక ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను 15వ తేదీన ప్లాన్ చేస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకుడు.

First Published:  9 April 2019 7:02 PM GMT
Next Story