Telugu Global
Cinema & Entertainment

'బంగార్రాజు' సినిమాలో హీరోయిన్ ఈమేనా?

2016 లో టాలీవుడ్ కింగ్ నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయన’ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ గా ‘బంగార్రాజు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా లో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించారు. మరి ఈ సినిమాలో ఎవరు హీరోయిన్లు గా నటిస్తున్నారు అనే విషయంపై ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన వార్త […]

బంగార్రాజు సినిమాలో హీరోయిన్ ఈమేనా?
X

2016 లో టాలీవుడ్ కింగ్ నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయన’ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ గా ‘బంగార్రాజు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.

కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా లో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించారు. మరి ఈ సినిమాలో ఎవరు హీరోయిన్లు గా నటిస్తున్నారు అనే విషయంపై ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో జ్యోతికను హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. నాగార్జున, జ్యోతిక ఇంతకుముందు ‘మాస్’ సినిమాలో నటించారు.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయిన జ్యోతిక ఈ మధ్యనే ‘నవాబ్’ అనే డబ్బింగ్ సినిమాల్లో కనిపించారు. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. కళ్యాణ్ కృష్ణ ఇప్పటికే ఈ స్క్రిప్ట్ పనులను పూర్తి చేశాడట.

ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా లాగానే ఈ సినిమా కూడా హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.

First Published:  10 April 2019 1:41 AM GMT
Next Story