Telugu Global
NEWS

బాబు ముఖంలో దిగులు.... తమ్ముళ్ల గుండెల్లో గుబులు!

24 గంటల సమయం. ఇన్నాళ్లు ప్రచారంలో ఎన్ని చెప్పినా… ఎలాంటి వాగ్దానాలు గుప్పించినా ప్రజల ముఖాల్లో మార్పు కనిపించడం లేదు. పసుపు-కుంకుమ ఫలితం కనిపించడం లేదు. అన్నదాత సుఖీభవ ను ఆదరించే ఆనవాళ్లు లేవు. ఎన్ని నిందలు మోపినా ఓటర్లు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇది. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖంలో దిగులు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది అని పార్టీ సీనియర్ […]

బాబు ముఖంలో దిగులు.... తమ్ముళ్ల గుండెల్లో గుబులు!
X

24 గంటల సమయం. ఇన్నాళ్లు ప్రచారంలో ఎన్ని చెప్పినా… ఎలాంటి వాగ్దానాలు గుప్పించినా ప్రజల ముఖాల్లో మార్పు కనిపించడం లేదు. పసుపు-కుంకుమ ఫలితం కనిపించడం లేదు. అన్నదాత సుఖీభవ ను ఆదరించే ఆనవాళ్లు లేవు. ఎన్ని నిందలు మోపినా ఓటర్లు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇది.

పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖంలో దిగులు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది అని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. గడచిన రెండు రోజులుగా నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు ముఖకవళికలు చూసిన తెలుగు తమ్ముళ్ళు గుండెల్లో గుబులు మొదలైందని చెబుతున్నారు. పార్టీకి ఆయువు పట్టు వంటి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి చుక్కెదురవుతోందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు..

పోల్ మేనేజ్మెంట్ కి పెట్టింది పెరు అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు వేస్తున్న ఎత్తులు కూడా పారే అవకాశాలు కనిపించడం లేదని చెబుతున్నారు. “ఒక్కసారి అవకాశం ఇవ్వాలి” అనే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష ముందు చంద్రబాబు నాయుడు వేస్తున్న ఎత్తులు, పైఎత్తులు పనికి రావడం లేదని సీనియర్ నాయకులు చెబుతున్నారు.

అన్ని నియోజకవర్గాల నుంచి తానే పోటీ చేస్తున్నాను అనుకుని టీడీపీ అభ్యర్ధులకు ఓటు వేయండి అంటూ ప్రజలను మభ్య పెట్టాలని చూసినా ఫలితం మాత్రం కనిపించడం లేదని అంటున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబును అభ్యర్థిగా భావించి ఓటు వేసినా… ఎన్నికల అనంతరం చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో కనిపించే పరిస్థితులు ఉండవని ఏపీ ప్రజలు భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ఈ పరిస్థితిని గమనించిన చంద్రబాబు నాయుడు రానున్న 24 గంటల్లోనే పరిస్థితిని అనుకూలంగా మార్చండి అంటూ సీనియర్ నాయకులు, తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు నాయుడు సీరియస్ గా చెప్పినట్లు సమాచారం.

First Published:  9 April 2019 9:06 PM GMT
Next Story