Telugu Global
NEWS

ఓట్ల కోసం బాబు కక్కుర్తి.... లక్ష కుటుంబాలకు పస్తులు

ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు ఎన్నో కుయుక్తులు, కుట్రలు చేస్తుంటాడని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంటుంది. కాని ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే చంద్రబాబు ఇంత ఘోరానికి దిగజారుతాడా అని సామాన్యులు కూడా అనక మానరు. ఎన్నికల డేట్ వచ్చేస్తోందని తెలిసి పసుపు – కుంకుమ డబ్బులను డ్వాక్రా మహిళలకు ఆఘమేఘాల మీద పంపిణీ చేశారు. అంతే కాకుండా ఓట్లు రాల్చే ఎన్నో పథకాలకు ఏపీ ఖజానా నుంచి నిధులు విడుదల చేశారు. వీటి ద్వారా తెలుగుదేశం […]

ఓట్ల కోసం బాబు కక్కుర్తి.... లక్ష కుటుంబాలకు పస్తులు
X

ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు ఎన్నో కుయుక్తులు, కుట్రలు చేస్తుంటాడని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంటుంది. కాని ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే చంద్రబాబు ఇంత ఘోరానికి దిగజారుతాడా అని సామాన్యులు కూడా అనక మానరు.

ఎన్నికల డేట్ వచ్చేస్తోందని తెలిసి పసుపు – కుంకుమ డబ్బులను డ్వాక్రా మహిళలకు ఆఘమేఘాల మీద పంపిణీ చేశారు. అంతే కాకుండా ఓట్లు రాల్చే ఎన్నో పథకాలకు ఏపీ ఖజానా నుంచి నిధులు విడుదల చేశారు. వీటి ద్వారా తెలుగుదేశం పార్టీకి లబ్ది చేకూర్చాలని తద్వారా తన అధికారాన్ని కాపాడుకోవాలని భావించారు.

కాగా, చాలా పథకాలకు నిధులు లేకుంటే.. ఏపీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాల నిధులను మళ్లించారు. ఇప్పటికీ ఎయిడెడ్ పాఠశాల టీచర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, అన్ని శాఖల్లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు నిలిపి వేశారు. గ్రామ పంచాయితీ కార్మికులకు 6 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. మరో వైపు విద్యాశాఖలోని కొంత మంది సిబ్బందికి 3 నెలల నుంచి వేతనాలు అందలేదు. వీళ్లే కాకుండా వేలాది మంది రెగ్యులర్ ఉద్యోగులకు చెల్లించాల్సిన అనేక రకాల అమౌంట్స్ ను కూడా దారి మళ్లించారు.

దీంతో లక్షల కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పులు తెచ్చుకొని కుటుంబాలను పోషించుకోవాల్సిన దుస్థితిని ఏపీ ఉద్యోగులు ఎదుర్కుంటున్నారు. దీనికి కారణం 1900 కోట్ల రూపాయల జీతాల నిధులను చంద్రబాబు పసుపు-కుంకుమ లాంటి ఇతర పథకాలకు దారి మళ్లించడమే.

కేవలం తన స్వలాభం కోసం లక్షలాది కుటుంబాలను పస్తులు ఉంచిన చంద్రబాబుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీతాలు లేకుండా ఎలా బతకాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక ఎన్నికలు ముగిసినా కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు వీరికి జీతాలు వస్తాయా రావా అనే మీమాంసలో ఉన్నారు.

ఇవి కాకుండా ఆర్థిక సంవత్సరం మొదలు కాగానే ఎనిమిది వేల కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ తీసుకున్నాడు. సుమారు 40,000 కోట్ల రూపాయల అప్పులు చేశాడు. ఈ భారమంతా తరువాత రాబోయే ప్రభుత్వం మీద పడనుంది. ప్రభుత్వం చెల్లించాల్సిన అనేక బిల్లులను పెండింగ్ లో పెట్టాడు. ఈ భారం కూడా వచ్చే ప్రభుత్వం భరించాల్సిందే.

First Published:  9 April 2019 11:17 AM GMT
Next Story