Telugu Global
NEWS

పవన్‌ వ్యాఖ్యలకు అలీ కౌంటర్

‘అలీ.. స్నేహమంటే ఇదేనా.. నీవు కష్టాల్లో ఉంటే నేను సహాయం చేశాను.. నువ్వు అడిగిన వాళ్లకు సీట్లు ఇచ్చాను.. నీకు ఎంపీ టికెట్ ఇస్తా అన్నాను.. కాని నువ్వు మాత్రం వెళ్లి వైసీపీలో చేరావు’.. అంటూ నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి రోడ్‌ షోలో నటుడు, వైసీపీ నేత అలీపై విరుచుక పడ్డారు. ఈ వ్యాఖ్యలపై అలీ తీవ్రంగా స్పందించారు. అలీ కష్టాల్లో ఉంటే సహాయం చేశానని వ్యాఖ్యానించారు కదా పవన్.. మీరు నాకు […]

పవన్‌ వ్యాఖ్యలకు అలీ కౌంటర్
X

‘అలీ.. స్నేహమంటే ఇదేనా.. నీవు కష్టాల్లో ఉంటే నేను సహాయం చేశాను.. నువ్వు అడిగిన వాళ్లకు సీట్లు ఇచ్చాను.. నీకు ఎంపీ టికెట్ ఇస్తా అన్నాను.. కాని నువ్వు మాత్రం వెళ్లి వైసీపీలో చేరావు’.. అంటూ నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి రోడ్‌ షోలో నటుడు, వైసీపీ నేత అలీపై విరుచుక పడ్డారు. ఈ వ్యాఖ్యలపై అలీ తీవ్రంగా స్పందించారు.

అలీ కష్టాల్లో ఉంటే సహాయం చేశానని వ్యాఖ్యానించారు కదా పవన్.. మీరు నాకు ఏం సహాయం చేశారు..? డబ్బులు ఇచ్చారా లేదా నేను సినిమాలు లేక ఇంట్లో కూర్చుంటే రికమెండ్ చేసి సినిమా అవకాశాలు ఇప్పించారా? అంటూ పవన్‌ని అలీ ప్రశ్నించారు.

మీరు ఈ కామెంట్లు ఏకంగా నా పుట్టిన ఊరైన రాజమండ్రిలో చేశారు. కాని రాజమండ్రిలో నేను ట్రస్ట్ పెట్టి కుల మతాలకు అతీతంగా సేవ చేస్తున్నాను. మీరు వేరే ఎక్కడో కామెంట్ చేసినా స్పందించే వాడిని కాను. కాని మీరు ఏకంగా నా సొంత ఊరికి వెళ్లి నా గురించి అనవసరమైన కామెంట్లు చేశారు అంటూ పవన్‌ని నిలదీశారు.

ఇది మీకు వచ్చిన ఆలోచన అని నేను అనుకోవట్లేదు.. రాజమండ్రి అలీ ఊరు కదా… మీరేదైనా కామెంట్ చేయండని పక్కన ఉన్నవాళ్లు చెప్పి ఉండొచ్చు అని అలీ అన్నారు. మీరు చిరంజీవి వేసిన బాటలో నడిచి వచ్చారు…. కానీ నేను మాత్రం నా బాటను నేనే వేసుకున్నా అని తీవ్రంగా స్పందించారు.

నేను ఇప్పటి వరకు ఎవరి దగ్గరకు వెళ్లి సహాయం చేయమని అడగలేదు. ఆ అల్లా దయవల్ల బాగానే ఉన్నాను.. ఒక వేళ అలా అడిగే రోజు వస్తే అలీ అనే వాడు ఉండనే ఉండడని అలీ అన్నారు. ఆకలితో అయినా చచ్చిపోతాను తప్ప వెళ్లి అడుక్కునే అలవాటు నాకు లేదన్నారు.

నేను వైసీపీలోనికి వెళ్తే తప్పేంటి..? రాజకీయాల్లోకి వచ్చాక ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సాధారణం. నేను ఇన్ని సభల్లో పాల్గొన్నా.. ఏ రోజూ మీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాని మీరు అనసరంగా నా గురించి మాట్లాడారు. నా గుండెల్లో ఎంతో పెద్ద స్థానమిచ్చినా మీరు చాలా పెద్ద మాటలు నా గురించి మాట్లాడారు అంటూ పవన్‌ను నిలదీశారు.

First Published:  8 April 2019 9:21 PM GMT
Next Story