Telugu Global
NEWS

సెటిలర్లు.... ఈసారి కారు ఎక్కరా...!

సెటిలర్లు. ఈ మాట అనడానికి వీలు లేదని తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానం మాటిమాటికీ చెబుతోంది. అయితే ఎన్నికల సమయంలో మాత్రం తెలంగాణలో సెటిలర్ అనే పదానికి విలువ పెరుగుతోంది. 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో…. తర్వాత జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల్లోనూ సెటిలర్లు అని పిలవబడే ఆంధ్రులు తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల అభిమానం చూపించారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో అయితే తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానమే ఊహించనంత రీతిలో సెటిలర్లు విజయాన్ని అందించారు. తెలంగాణలో జరిగిన ముందస్తు […]

సెటిలర్లు.... ఈసారి కారు ఎక్కరా...!
X

సెటిలర్లు. ఈ మాట అనడానికి వీలు లేదని తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానం మాటిమాటికీ చెబుతోంది. అయితే ఎన్నికల సమయంలో మాత్రం తెలంగాణలో సెటిలర్ అనే పదానికి విలువ పెరుగుతోంది. 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో…. తర్వాత జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల్లోనూ సెటిలర్లు అని పిలవబడే ఆంధ్రులు తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల అభిమానం చూపించారు.

జిహెచ్ఎంసి ఎన్నికల్లో అయితే తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానమే ఊహించనంత రీతిలో సెటిలర్లు విజయాన్ని అందించారు. తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికలలో కూడా సెటిలర్లు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులను గెలిపించి అభిమానాన్ని చాటుకున్నారు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇతర మిత్రపక్షాలతో కలిసి మహాకూటమిగా ఏర్పడినా వారికి సెటిలర్ల నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు.

దీంతో తెలంగాణలో ఉన్న వారందరూ తెలంగాణ వాసులని, వారిని సెటిలర్లు అంటూ పిలవరాదు అని టిఆర్ఎస్ అధిష్టానం పిలుపునిచ్చింది. ఇక్కడి వరకు కథ బాగానే ఉంది. లోక్ సభ ఎన్నికలలోనే డామిట్ కథ అడ్డం తిరిగేలా ఉంది అని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా అందులో ఒక స్థానంలో మజ్లిస్ పార్టీ విజయం ఖాయం. ఇక మిగిలిన 16 స్థానాలు తమకే దక్కుతాయని తెలంగాణ రాష్ట్ర సమితి ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ 16 స్థానాలలోనూ దాదాపు ఐదారు స్థానాల జయాపజయాలు సెటిలర్ల పైనే ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మారుతున్న పరిస్థితులను అంచనా వేసిన రాజకీయ విశ్లేషకులు సెటిలర్లు తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు పలికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అంటున్నారు.

రెండోసారి అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు పట్ల సెటిలర్లలో వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెపుతున్నారు. దీనికి కారణం స్థానికంగా గెలిపించిన ఎమ్మెల్యేలు సెటిలర్ల పట్ల ఉదాసీన వైఖరి అవలంభిస్తున్నారని, వారిలో నియంతృత్వ ధోరణి ఎక్కువైంది అనే భావన సెటిలర్ల లో కనిపిస్తోందని చెబుతున్నారు.

సెటిలర్ల ఎక్కువ మంది జన్మస్థలమైన ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పడం, తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైలుపైనే అంటూ రాహుల్ గాంధీ ప్రకటించడంతో ఈసారి సెటిలర్ల ఓట్లు కాంగ్రెస్ కు అనుకూలంగా పడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దీంతో ఈసారి లోక్ సభ ఎన్నికలలో సెటిలర్లు కారు ఎక్కే పరిస్థితులు అంతగా కనిపించడం లేదని చెబుతున్నారు.

First Published:  7 April 2019 10:45 PM GMT
Next Story