Telugu Global
Cinema & Entertainment

మజిలీ ఫస్ట్ వీకెండ్ వసూళ్లు

ఎట్టకేలకు ఓ హిట్ కొట్టాడు నాగచైతన్య. అది కూడా అలాంటిలాంటి హిట్ కాదు. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్. అదే మజిలీ సినిమా. అవును.. భార్య సమంతతో కలిసి చైతూ చేసిన మజిలీ సినిమా సూపర్ హిట్ అయింది. రేపోమాపో ఇది బ్రేక్-ఈవెన్ కూడా అవ్వబోతోంది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా నిన్నటితో ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకుంది. విడుదలైన ఈ 3 రోజుల్లో ఈ సినిమాకు వరల్డ్ వైడ్ 17 కోట్ల 35 లక్షల రూపాయల […]

మజిలీ ఫస్ట్ వీకెండ్ వసూళ్లు
X

ఎట్టకేలకు ఓ హిట్ కొట్టాడు నాగచైతన్య. అది కూడా అలాంటిలాంటి హిట్ కాదు. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్. అదే మజిలీ సినిమా. అవును.. భార్య సమంతతో కలిసి చైతూ చేసిన మజిలీ సినిమా సూపర్ హిట్ అయింది. రేపోమాపో ఇది బ్రేక్-ఈవెన్ కూడా అవ్వబోతోంది.

శుక్రవారం విడుదలైన ఈ సినిమా నిన్నటితో ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకుంది. విడుదలైన ఈ 3 రోజుల్లో ఈ సినిమాకు వరల్డ్ వైడ్ 17 కోట్ల 35 లక్షల రూపాయల షేర్ వచ్చింది. అటు నైజాంలో కూడా నాగచైతన్యది రికార్డే. విడుదలైన 3 రోజుల్లోనే ఈ సినిమాకు 5 కోట్లకు పైగా షేర్ వచ్చింది. ఇప్పటివరకు చైతూ నటించిన ఏ సినిమా ఈ ఫీట్ సాధించలేదు.

మొన్నటివరకు శైలజారెడ్డి అల్లుడు సినిమాకు మాత్రమే చైతూ కెరీర్ లో నే భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి. ఇప్పుడా సినిమాను మజిలీ క్రాస్ చేసింది. శివనిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రైట్ టైమ్ లో మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం థియేటర్లలో ఏ సినిమా లేదు. అది దీనికి బాగా కలిసొచ్చింది. ఏపీ, నైజాంలో ఈ సినిమాకు వచ్చిన 3 రోజుల వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 5.35 కోట్లు
సీడెడ్ – రూ. 1.77 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.94 కోట్లు
ఈస్ట్ – రూ. 0.90 కోట్లు
వెస్ట్ – రూ. 0.64 కోట్లు
గుంటూరు – రూ. 1.24 కోట్లు
కృష్ణా – రూ. 1 కోటి
నెల్లూరు – రూ. 0.40 కోట్లు
ఓవర్సీస్ – రూ. 2.25 కోట్లు

First Published:  8 April 2019 6:51 AM GMT
Next Story