Telugu Global
Cinema & Entertainment

2 స్టేట్స్ రీమేక్ ని డైరెక్ట్ చేయనున్న జీవిత?

బాలీవుడ్ లో పెద్ద విజయం సాధించిన 2 స్టేట్స్ సినిమా ని తెలుగు లో రీమేక్ చేయనున్నట్లు చాలా కాలం క్రితమే అనౌన్స్ చేశారు. అయితే సినిమా మాత్రం ఇంకా పూర్తి కాలేదు సరి కదా… ప్రస్తుతం సినిమా షూటింగ్ ఆగిపోయింది. గత కొన్ని నెలలు గా సినిమా హీరో అడివి శేష్, మరియు దర్శకుడు వెంకట్ మధ్య విభేదాలు నడుస్తూ ఉండడం తో సినిమా షూటింగ్ అర్ధాంతరం గా ఆపేసారు. చాలా మంది వీరి ఇద్దరినీ […]

2 స్టేట్స్ రీమేక్ ని డైరెక్ట్ చేయనున్న జీవిత?
X

బాలీవుడ్ లో పెద్ద విజయం సాధించిన 2 స్టేట్స్ సినిమా ని తెలుగు లో రీమేక్ చేయనున్నట్లు చాలా కాలం క్రితమే అనౌన్స్ చేశారు. అయితే సినిమా మాత్రం ఇంకా పూర్తి కాలేదు సరి కదా… ప్రస్తుతం సినిమా షూటింగ్ ఆగిపోయింది.

గత కొన్ని నెలలు గా సినిమా హీరో అడివి శేష్, మరియు దర్శకుడు వెంకట్ మధ్య విభేదాలు నడుస్తూ ఉండడం తో సినిమా షూటింగ్ అర్ధాంతరం గా ఆపేసారు. చాలా మంది వీరి ఇద్దరినీ కలపాలని ప్రయత్నం చేశారు. కానీ వీలు పడలేదు. నిర్మాత కూడా చేసేది ఏమి లేక సినిమాని మధ్యలో ఆపాలని నిర్ణయం తీసుకున్నాడు.

ఈ సినిమా అడివిశేష్ కి అంత ముఖ్యం అయినది కాకపోయినా ఈ సినిమా రాజశేఖర్ పెద్ద కూతురు శివానికి మాత్రం చాలా ముఖ్యం. ఎంతో ప్రతిష్టాత్మకంగా శివానిని లాంచ్ చేద్దాం అనుకున్న జీవిత రాజశేఖర్ దంపతులకి ఇదొక సమస్య గా మారింది.

అయితే మంచి సినిమా ని వదులుకోవడం జీవిత-రాజశేఖర్ కి ఇష్టం లేదు. వారు నిర్మాత దగ్గర నుండి సినిమా కొనుక్కొని వారు కంప్లీట్ గా టెక్ ఓవర్ చేయాలనే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా తీసేసుకున్న తర్వాత జీవిత మిగిలిన పార్ట్ ని డైరెక్ట్ చేసే అవకాశం ఉందట.

First Published:  8 April 2019 4:00 AM GMT
Next Story