Telugu Global
Cinema & Entertainment

మహేష్ తో పోటీ పడుతున్న నిఖిల్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మకం గా తీసుకొని చేస్తున్న చిత్రం మహర్షి. ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే మైలురాయి గా నిలిచిపోవాలని సినిమా యూనిట్ సభ్యులు కష్ట పడుతున్నాయి. ఔట్ పుట్ కోసం అస్సలు కాంప్రమైస్ అవ్వాల్సిన పని లేదు అని దర్శక నిర్మాతలు ఈ పాటికే నిర్ణయనించుకున్నారు. అందుకే క్వాలిటీ విషయంలో రాజీ లేకుండా సినిమా ఆలస్యం అయినా పర్వాలేదు అనే భావం తో ముందుకెళ్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే రెండు సార్లు […]

మహేష్ తో పోటీ పడుతున్న నిఖిల్
X

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మకం గా తీసుకొని చేస్తున్న చిత్రం మహర్షి. ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే మైలురాయి గా నిలిచిపోవాలని సినిమా యూనిట్ సభ్యులు కష్ట పడుతున్నాయి. ఔట్ పుట్ కోసం అస్సలు కాంప్రమైస్ అవ్వాల్సిన పని లేదు అని దర్శక నిర్మాతలు ఈ పాటికే నిర్ణయనించుకున్నారు.

అందుకే క్వాలిటీ విషయంలో రాజీ లేకుండా సినిమా ఆలస్యం అయినా పర్వాలేదు అనే భావం తో ముందుకెళ్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. చివరికి మే 9 న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నాం అని ప్రకటించడంతో అభిమానులు అందరూ చాలా ఆత్రుత గా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా కి వారం ముందు, వారం తర్వాతా ఇంకే సినిమా కూడా విడుదల అయ్యే ఛాన్స్ లేదు. కానీ నిఖిల్ మాత్రం తన అర్జున్ సురవరం సినిమా ని సరిగ్గా మహర్షి విడుదలకి వారం ముందు విడుదల చేసేందుకు సన్నాహాలు చేయిస్తున్నాడు.

సాధారణంగా సినిమా బాగుంటే మాత్రం, రెండో వారం లో పుంజుకొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మహర్షి రాకతో థియేటర్లు దొరికే అవకాశం ఉండదు కాబట్టి నిఖిల్ కి ఇది ఖచ్చితంగా పెద్ద ప్రయోగం అని చెప్పాలి. ఇంకోసారి విడుదల గురించి అలోచించి మహర్షి వచ్చిన తర్వాత ఈ సినిమాని విడుదల చేస్తే బాగుంటుందని ఆయన సన్నిహితులు సలహా ఇస్తున్నారట.

First Published:  7 April 2019 11:06 PM GMT
Next Story