Telugu Global
Cinema & Entertainment

వేణుశ్రీరామ్ దర్శకత్వంలో బన్నీ

తన పుట్టినరోజు సందర్భంగా మరో సినిమా ఎనౌన్స్ చేశాడు బన్నీ. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. దీనికి ఐకాన్ అనే పేరు పెట్టారు. ‘కనబడుటలేదు’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది. దిల్ రాజు బ్యానర్ లో ఇప్పటికే 3 సినిమాలు చేశాడు బన్నీ. ఆర్య, పరుగు, దువ్వాడ జగన్నాధమ్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు దిల్ రాజు, బన్నీ కాంబోలో నాలుగో చిత్రంగా […]

వేణుశ్రీరామ్ దర్శకత్వంలో బన్నీ
X

తన పుట్టినరోజు సందర్భంగా మరో సినిమా ఎనౌన్స్ చేశాడు బన్నీ. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. దీనికి ఐకాన్ అనే పేరు పెట్టారు. ‘కనబడుటలేదు’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది.

దిల్ రాజు బ్యానర్ లో ఇప్పటికే 3 సినిమాలు చేశాడు బన్నీ. ఆర్య, పరుగు, దువ్వాడ జగన్నాధమ్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు దిల్ రాజు, బన్నీ కాంబోలో నాలుగో చిత్రంగా ఐకాన్ మూవీ వస్తోంది. ఇదొక యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ అని తెలుస్తోంది.

త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న త్రివిక్రమ్ సినిమాను పక్కనపెడితే, ఓ వైపు దిల్ రాజు మూవీ మరోవైపు సుకుమార్ సినిమా బన్నీ చేతిలో ఉన్నాయి.

త్రివిక్రమ్ సినిమా తర్వాత ఈ రెండు సినిమాల్లో ఏది సెట్స్ పైకి వస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్. వేణుశ్రీరామ్ మాత్రం ఐకాన్ సినిమాకు సంబంధించి టోటల్ స్క్రీన్ ప్లే రెడీ చేశాడు.

First Published:  8 April 2019 6:50 AM GMT
Next Story