Telugu Global
NEWS

ఫ్యాన్ కి కలిసి వస్తున్న తల్లి, చెల్లి ప్రచారం...!

“జగన్ బాబుకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. పాలనలో ఆయన తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిని మించిపోతారు. ఓ తల్లిగా నేను మీకు హామీ ఇస్తున్నాను” ఇవి ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైయస్ విజయమ్మ మాటలు. “ అన్నయ్య వస్తే రాజన్న రాజ్యం వచ్చినట్లే. జగనన్నకు ఒకసారి అవకాశం ఇవ్వండి” ఇవి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి చెల్లెలు షర్మిల మాటలు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వైయస్ […]

ఫ్యాన్ కి కలిసి వస్తున్న తల్లి, చెల్లి ప్రచారం...!
X

“జగన్ బాబుకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. పాలనలో ఆయన తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిని మించిపోతారు. ఓ తల్లిగా నేను మీకు హామీ ఇస్తున్నాను” ఇవి ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైయస్ విజయమ్మ మాటలు.

“ అన్నయ్య వస్తే రాజన్న రాజ్యం వచ్చినట్లే. జగనన్నకు ఒకసారి అవకాశం ఇవ్వండి” ఇవి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి చెల్లెలు షర్మిల మాటలు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వైయస్ విజయమ్మ, షర్మిల ప్రచార సభలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు.

జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసేందుకు మీరందరూ సహకరించాలంటూ వారిద్దరూ చేస్తున్న ప్రచారానికి పెద్ద ఎత్తున మద్దతు వస్తుందంటున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర ప్రదేశ్ లో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతాయని, అవినీతికి ఆస్కారం లేని ప్రభుత్వం ఏర్పాటవుతుందని వారిద్దరూ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారానికి సానుకూల స్పందన వస్తున్నట్లుగా పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు.

జగన్ తల్లి వైయస్ విజయమ్మ, సోదరి షర్మిల ప్రచారానికి మహిళల నుంచి అపూర్వ ఆదరణ వస్తుందని పార్టీ నాయకులు అంటున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే తమ కష్టాలు తీరుతాయని, ఆయన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి లాగే జగన్ కూడా పేదల పక్షపాతి అని మహిళలు విశ్వసిస్తున్నారు.

విజయమ్మ, షర్మిల ప్రచారం కూడా మరింత లాభం చేకూరుస్తుందని, మహిళల ఓట్లు గంపగుత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం ఉందని నాయకులు భావిస్తున్నారు. విజయమ్మ లో అమాయకత్వం, షర్మిల లోని ధైర్యం మహిళలను ఆకట్టుకుంటున్నాయని, యువతీ యువకులు పార్టీ వైపు చూస్తున్నారని అంటున్నారు. విజయమ్మ, షర్మిల ప్రచారంతో పార్టీకి మరింత మేలు చేకూరుతుందనే విశ్వాసం తమకు ఉందని పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు.

First Published:  7 April 2019 12:11 AM GMT
Next Story