Telugu Global
Cinema & Entertainment

వెంకీ సినిమా నుంచి తప్పుకున్న కోన

ఈ మధ్యనే ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనే మల్టీ స్టారర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న సీనియర్ హీరో వెంకటేష్ మరొక మల్టీస్టారర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అదే ‘వెంకీ మామ’ సినిమా. ఈ చిత్రంలో వెంకీ మరియు నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్నారు. కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన మొదటి షెడ్యూల్ పూర్తయింది. […]

వెంకీ సినిమా నుంచి తప్పుకున్న కోన
X

ఈ మధ్యనే ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనే మల్టీ స్టారర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న సీనియర్ హీరో వెంకటేష్ మరొక మల్టీస్టారర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అదే ‘వెంకీ మామ’ సినిమా.

ఈ చిత్రంలో వెంకీ మరియు నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్నారు. కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన మొదటి షెడ్యూల్ పూర్తయింది. సినిమా ఎనౌన్స్ చేసేటప్పుడు ఈ చిత్రాన్ని సురేష్ బాబు, టిజి విశ్వ ప్రసాద్, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు ప్రకటించారు.

అదేవిధంగా సినిమా లాంచ్ వేడుకలో సైతం కోన వెంకట్ కనిపించారు. ఈ చిత్రం గురించి కొన్ని సార్లు ట్విట్టర్ ద్వారా అప్ డేట్ లు కూడా షేర్ చేశారు. కానీ ఈ మధ్యనే ‘వెంకీ మామ’ చిత్ర పోస్టర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. కానీ ఈ పోస్టర్ లో కోన వెంకట్ పేరు కనపడలేదు. దానికి కారణం ఏంటా అని ఆరా తీయగా కోన వెంకట్ ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్టు తెలుస్తోంది.

దీని గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. కానీ కోన వెంకట్ ఈ మల్టీస్టారర్ సినిమా నుండి తప్పుకున్నట్లు వార్తలు మాత్రం బయటకు వస్తున్నాయి.

First Published:  7 April 2019 12:49 AM GMT
Next Story