Telugu Global
Health & Life Style

నేనే కాదు... నా విత్తనాలు ఎంతో ఆరోగ్యం : పుచ్చకాయ

హలో.. శుభోదయం.. వేసవి కదా.. ఈ సీజన్ లో నేను బాగా దొరుకుతాను. నేను పెరగడానికి కనీసం 80 రోజుల సమయం పడుతుంది. నన్ను తర్బూజా అని, పుచ్చకాయ అని… ఇంగ్లీషులో వాటర్ మిలన్ అని పిలుస్తారు. నా గురించి మీకు పూర్తిగా తెలియకపోవచ్చు. చాలా మంది నా గుజ్జును పంచదారతో కలిపి తినటానికి ఇష్టపడతారు. నన్ను జ్యూస్ చేసుకుని తాగుతారు అనుకోండి. అన్నట్లు నా కడుపులో ఉండే విత్తనాలను ఏం చేస్తున్నారు. కొంపతీసి పారేస్తురా..!. ఆ […]

నేనే కాదు... నా విత్తనాలు ఎంతో ఆరోగ్యం : పుచ్చకాయ
X

హలో.. శుభోదయం.. వేసవి కదా.. ఈ సీజన్ లో నేను బాగా దొరుకుతాను. నేను పెరగడానికి కనీసం 80 రోజుల సమయం పడుతుంది. నన్ను తర్బూజా అని, పుచ్చకాయ అని… ఇంగ్లీషులో వాటర్ మిలన్ అని పిలుస్తారు. నా గురించి మీకు పూర్తిగా తెలియకపోవచ్చు.

చాలా మంది నా గుజ్జును పంచదారతో కలిపి తినటానికి ఇష్టపడతారు. నన్ను జ్యూస్ చేసుకుని తాగుతారు అనుకోండి. అన్నట్లు నా కడుపులో ఉండే విత్తనాలను ఏం చేస్తున్నారు. కొంపతీసి పారేస్తురా..!. ఆ విత్తనాలు ఎంత ఆరోగ్యమో.. ఎన్ని రోగాలను నియంత్రిస్తుందో మీకు తెలుసా… తెలియదు లెండి. అందుకే వాటిని మీరు బయట పడేస్తున్నారు.

అందుకే నేనే నా విత్తనాలు ఎంత ఆరోగ్యమో చెప్తాను వినండి. వాటితో పాటు నన్ను తింటే ఎంత మంచిదో కూడా చెప్తాను.

  • నాలో 92 శాతం నీరు… పొటాషియం కూడా ఉంటాయి. అది గుండెకు ఎంతో మేలు చేస్తుంది.
  • నాలో ఉన్న విటమిన్ బి రక్తపోటును నియంత్రిస్తుంది.
  • నేను యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉన్నాను. దీని వల్ల హానికర వ్యర్దాలను, వాయువులను బయటకు పంపేందుకు ఉపయోగపడతాను.
  • ఇక నా విత్తనాలలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. నా విత్తనాలు మెగ్నీషియం, ఓమేగా 3, ఐరన్, కాపర్, మాంగనీస్ ఉన్నాయి.
  • నా విత్తనాలు ఎలా తినాలా? అని ఆలోచిస్తున్నారా…. మీరు తాగే ప్రోటీన్ షేక్స్, మిల్క్ షేక్స్ ల్లో కలుపుకోవచ్చు. లేదంటే సాలడ్స్ లో కూడా కలపుకుని తినండి. మంచి బలాన్ని ఇస్తాయి.
  • నా గురించి ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే నా విత్తనాలతో చేసిన నూనే అనేక చర్మ సమస్యలకు చెక్ పెడుతుంది. మీ జుట్టు బలంగా పెరుగుతుంది. మీ చుండ్రు సమస్యలను దూరం చేస్తుంది.
  • ఎర్రటి నా గుజ్జు.. నా విత్తనాలు కూడా మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. నేను మానవ శరీరంలో గ్లూకోజ్ స్దాయిలను అదుపు చేస్తాను… అంటే డయాబిటీస్ ను అదుపు చేసే శక్తి నాలో ఉంది.
  • శరీరంలో ఉన్న ఎంజైములను మెగ్నీషియం, ఇతర పోషకాలను పీల్చుకునేలా నా విత్తనాలు సాయపడతాయి.
  • నాలో ఉన్న మెగ్నీషియం మీ జ్ఞాపక శక్తిని పెంచుతుంది.
  • నేను… నా విత్తనాలు కూడా చెడు కొలెస్ట్రాల్ ను అదపు చేయడంలో ముందుంటాం.

ఇప్పుడు తెలిసిందా.. నా గొప్పతనం… నాలోని విత్తనాల గొప్పతనం… ఈ సారి వాటిని పారేయకండే.. దాచుకుని.. సాలడ్స్ లలో కాని… కూరలలో కాని… షేక్స్ లలో కాని వేసుకోండి. మీ ఆరోగ్యమే నా మహాభాగ్యం. ఈ వేసవే కాదు… ప్రతి వేసవిలోనూ మీకు నేను తోడు ఉంటా… బై..బై..

మీ… పుచ్చకాయ…తర్బుజా…. వాటర్ మిలన్…

First Published:  5 April 2019 1:25 AM GMT
Next Story