Telugu Global
Cinema & Entertainment

రష్మిక కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన దేవరకొండ

విజయ్ దేవరకొండ, రష్మిక…. గీత గోవిందం సినిమా లో కలిసి నటించారు. ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఆ సినిమా తర్వాత ఈ ఇద్దరికీ హిట్ పెయిర్ అనే పేరు కూడా ఇండస్ట్రీ అంటించింది. గీత గోవిందం విడుదల అవ్వగానే ఈ ఇద్దరి కాంబినేషన్ ని సెట్ చేసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ‘డియర్ కామ్రేడ్’ సినిమా ని అనౌన్స్ చేశారు. భరత్ కమ్మ ఈ సినిమా తో దర్శకుడిగా మారనున్నాడు. అయితే ఈ […]

రష్మిక కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన దేవరకొండ
X

విజయ్ దేవరకొండ, రష్మిక…. గీత గోవిందం సినిమా లో కలిసి నటించారు. ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఆ సినిమా తర్వాత ఈ ఇద్దరికీ హిట్ పెయిర్ అనే పేరు కూడా ఇండస్ట్రీ అంటించింది.

గీత గోవిందం విడుదల అవ్వగానే ఈ ఇద్దరి కాంబినేషన్ ని సెట్ చేసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ‘డియర్ కామ్రేడ్’ సినిమా ని అనౌన్స్ చేశారు. భరత్ కమ్మ ఈ సినిమా తో దర్శకుడిగా మారనున్నాడు.

అయితే ఈ సినిమా ఆరంభం నుండే ఈ ఇద్దరి పై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఇటీవలే విడుదల అయిన టీజర్ చూసిన చాలా మంది ఈ హిట్ పెయిర్ మరోసారి విజయాన్ని రిపీట్ చేయనున్నారని ఒక నిర్ణయానికి వచ్చారు.

అయితే ప్రమోషన్స్ విషయం లో ఎప్పుడూ ముందుండే విజయ్ దేవరకొండ…. తన హీరోయిన్ రష్మిక పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు ఒక వీడియో ని పోస్ట్ చేసాడు. రష్మిక కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేసిన ఆ వీడియో డియర్ కామ్రేడ్ సినిమా టీజర్ కి స్పూఫ్.

దాన్ని చూసి రష్మిక షాక్ అయి…. తన ఫ్యాన్స్ ని ఎందుకు ఇలా కంగారు పెడుతున్నావ్ అని విజయ్ ని ప్రశ్నించింది. ఇలాంటి వీడియో పోస్ట్ చేయడానికి నిర్మాతలు ఎలా ఒప్పుకున్నారు అని ఫన్నీ గా అడిగింది.

ఇది జరిగిన కొద్దీ సేపటికే విజయ్ మళ్ళీ ఒక ఫొటో పెట్టి రష్మిక ని పొగుడుతూ సినిమా లోని మొదటి పాట త్వరలో విడుదల కానుంది అని తెలిపాడు.

First Published:  5 April 2019 3:05 AM GMT
Next Story