Telugu Global
Cinema & Entertainment

మహేష్ సినిమా నుండి తప్పుకున్న దిల్ రాజు?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మే 9న విడుదల కానుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత మహేష్ బాబు తన తదుపరి సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ మధ్యనే ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి ఇంతకు ముందు […]

మహేష్ సినిమా నుండి తప్పుకున్న దిల్ రాజు?
X

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మే 9న విడుదల కానుంది.

ఈ సినిమా పూర్తయిన తర్వాత మహేష్ బాబు తన తదుపరి సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ మధ్యనే ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి ఇంతకు ముందు సినిమాల లాగానే మహేష్ బాబు సినిమాకి కూడా ఎంటర్ టైన్ మెంట్ ప్రధానాంశంగా కథ సిద్దం చేస్తున్నాడట. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని హైదరాబాద్ లో అధికారికంగా లాంచ్ చేయనున్నారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా అప్పటి నుంచే సెట్స్ పైకి వెళ్లనుంది. నిజానికి ఈ చిత్రాన్ని అనిల్ సుంకర మరియు దిల్ రాజు సంయుక్తంగా నిర్మించాల్సి ఉంది. కానీ దిల్ రాజు ఈ చిత్రం నుండి తప్పుకున్నారని, ఇప్పుడు నిర్మాణ వ్యవహారాలు అనిల్ సుంకర చూసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న ను తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అనిల్ రావిపూడి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ నెలాఖరుకల్లా ఆ పనులు పూర్తి చేయనున్నాడు. మహేష్ బాబు ఈ సినిమాలో ఎంటర్ టైనింగ్ పాత్రలో కనిపించనున్నాడు.

First Published:  4 April 2019 10:09 PM GMT
Next Story