Telugu Global
Cinema & Entertainment

తెలుగు ఇండస్ట్రీ పై.... రకుల్ కామెంట్స్

ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొత్తలో కొన్ని ఇబ్బందులు పడ్డప్పటికీ వరుస విజయాలతో రకుల్ ప్రీత్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ వచ్చిన రకుల్ …. మహేష్ బాబుతో కలిసి నటించిన ‘స్పైడర్’ సినిమా తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ఈ మధ్యనే ‘దేవ్’ అనే డబ్బింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ ప్రీత్ ఈ సినిమాతో పెద్దగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం […]

తెలుగు ఇండస్ట్రీ పై.... రకుల్ కామెంట్స్
X

ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొత్తలో కొన్ని ఇబ్బందులు పడ్డప్పటికీ వరుస విజయాలతో రకుల్ ప్రీత్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ వచ్చిన రకుల్ …. మహేష్ బాబుతో కలిసి నటించిన ‘స్పైడర్’ సినిమా తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు.

ఈ మధ్యనే ‘దేవ్’ అనే డబ్బింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ ప్రీత్ ఈ సినిమాతో పెద్దగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం తమిళం మరియు హిందీ సినిమాలతో బిజీగా ఉన్న రకుల్ నాగార్జున సరసన ‘మన్మధుడు 2’ సినిమాలో నటిస్తోంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…. టాలీవుడ్ హీరో సెంట్రిక్ ఇండస్ట్రీ కాదని చెప్పుకొచ్చింది… “టాలీవుడ్ హీరో సెంట్రిక్ ఇండస్ట్రీ అని నేను అనుకోను. ఈ మధ్యకాలంలో పరిస్థితులు మారుతున్నాయి. ఉదాహరణకు ‘బాహుబలి’ లాంటి పెద్ద సినిమాలు చూస్తే ఆ సినిమాలో అనుష్క పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది” అని చెప్పిన రకుల్…. నయనతార, త్రిష, కంగనా రనౌత్, దీపికా పదుకొనే, అలియా భట్ తదితరులు మంచి పాత్రలను ఎంచుకుంటూ ఫిమేల్ సెంట్రిక్ సినిమాలపై కూడా దృష్టి పెడుతున్నారని గుర్తు చేసింది.

First Published:  3 April 2019 11:19 PM GMT
Next Story