Telugu Global
Cinema & Entertainment

నాగార్జున.... 'మజిలీ' చూడలేదట

అక్కినేని హీరోల లో ఎవరి సినిమా విడుదల కాబోతున్నా సరే ముందుగా కింగ్ నాగార్జున సినిమా ఫైనల్ కాఫీ ని చూస్తారు. చూసి అందులో ఏమైనా రీషూట్ చేయాల్సిన సీన్లు ఉంటే వాటిని సూచిస్తారు. అయితే తాజాగా అక్కినేని నాగచైతన్య, సమంత హీరో హీరోయిన్లుగా పెళ్లి తర్వాత మొట్ట మొదటి సారిగా కలిసి నటిస్తున్న సినిమా ‘మజిలీ’ ఏప్రిల్ 5న విడుదల కానుంది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను నాగార్జున ఇంకా చూడలేదట. ఈ […]

నాగార్జున.... మజిలీ చూడలేదట
X

అక్కినేని హీరోల లో ఎవరి సినిమా విడుదల కాబోతున్నా సరే ముందుగా కింగ్ నాగార్జున సినిమా ఫైనల్ కాఫీ ని చూస్తారు. చూసి అందులో ఏమైనా రీషూట్ చేయాల్సిన సీన్లు ఉంటే వాటిని సూచిస్తారు.

అయితే తాజాగా అక్కినేని నాగచైతన్య, సమంత హీరో హీరోయిన్లుగా పెళ్లి తర్వాత మొట్ట మొదటి సారిగా కలిసి నటిస్తున్న సినిమా ‘మజిలీ’ ఏప్రిల్ 5న విడుదల కానుంది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను నాగార్జున ఇంకా చూడలేదట. ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో నాగ చైతన్య స్వయంగా ఈ విషయాన్ని చెప్పాడు.

నాగార్జున ఫ్రీగా ఉన్న సమయంలో ‘మజిలీ’ సినిమా రీ-రికార్డింగ్ పనులు పూర్తి కాలేదని అసలే ప్రేమ కథ కాబట్టి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకుండా సినిమా చూస్తే బాగోదని ఇంకా ఈ సినిమా చూడలేదట. అయితే నాగచైతన్య చెప్పిన మాటలను బట్టి చూస్తే ఈ చిత్రానికి రీషూట్ చేయాల్సిన అవసరం లేదని…. పైగా పూర్తి బాధ్యతను నాగ్…. దర్శకుడు శివ నిర్వాణ చేతిలో పెట్టినట్లు తెలుస్తోంది.

ఇక ఈ చిత్రం మిడిల్ క్లాస్ సెంటిమెంట్ తో నడుస్తుందని సినిమా చూసిన అందరూ సమంత పాత్ర లో ప్రేమలో పడతారని కానీ తన పాత్ర మాత్రం అందరితో తగాదాలు పెట్టుకుంటూ ఉంటుందని చెప్పుకొచ్చాడు నాగచైతన్య.

First Published:  3 April 2019 9:40 PM GMT
Next Story