Telugu Global
Cinema & Entertainment

మజిలీ సెన్సార్ రిపోర్ట్

మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతోంది మజిలీ సినిమా. నాగచైతన్య-సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సెన్సార్ పూర్తయింది. 154 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకు సెన్సార్ అధికారులు U/A సర్టిఫికేట్ ఇచ్చారు. సేమ్ టైం, సినిమా టాక్ కూడా బయటకు వచ్చింది. సెన్సార్ ఆఫీసర్లు చెబుతున్న మాట ప్రకారం, ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఎమోషనల్ మూవీ అట. సినిమాలో దాదాపు 70శాతం కంటెంట్ ఎమోషనల్ గానే ఉంటుందట. ఫ్లాష్ బ్యాక్ లో […]

మజిలీ సెన్సార్ రిపోర్ట్
X

మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతోంది మజిలీ సినిమా. నాగచైతన్య-సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సెన్సార్ పూర్తయింది. 154 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకు సెన్సార్ అధికారులు U/A సర్టిఫికేట్ ఇచ్చారు. సేమ్ టైం, సినిమా టాక్ కూడా బయటకు వచ్చింది.

సెన్సార్ ఆఫీసర్లు చెబుతున్న మాట ప్రకారం, ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఎమోషనల్ మూవీ అట. సినిమాలో దాదాపు 70శాతం కంటెంట్ ఎమోషనల్ గానే ఉంటుందట. ఫ్లాష్ బ్యాక్ లో మాత్రం దివ్యాంక కౌషిక్ తో వచ్చే సన్నివేశాలు అక్కడక్కడ కాస్త కామిక్ గా ఉంటాయట. అది మినహాయిస్తే సినిమా మొత్తం కథ ప్రకారం వెళ్లిపోతుందంటున్నారు.

ఇక మజిలీకి మరో ఎట్రాక్షన్ క్లైమాక్స్. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ క్లైమాక్స్ మాత్రమే అంటున్నారు. క్లైమాక్స్ లో సమంత, నాగచైతన్య పెర్ఫార్మెన్స్ చాలా బాగుందనే టాక్ వినిపిస్తోంది. అటు ఇంటర్వ్యూల్లో హీరోహీరోయిన్లు కూడా అదే మాట చెబుతున్నారు.

క్లైమాక్స్ కోసం చాలా రోజులు హోం వర్క్ చేశామని, అది అద్భుతంగా వచ్చిందని చెబుతున్నారు. నాగచైతన్య అయితే మరో అడుగు ముందుకేసి, తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ మజిలీ సినిమాలో ఉంటుందని చెప్పుకొచ్చారు. రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది మజిలీ సినిమా.

First Published:  4 April 2019 4:00 AM GMT
Next Story