Telugu Global
Cinema & Entertainment

నో బాలీవుడ్.. ఫోకస్ అంతా ఇక్కడే

తమ అభిమాన హీరో బాలీవుడ్ కు ఎప్పుడు వెళ్తాడా.. హిందీలో ఎప్పుడు సినిమా చేస్తాడా అని సూపర్ స్టార్ అభిమానులు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు. మహేష్ కూడా ఎప్పుడూ బాలీవుడ్ లో సినిమా చేయనని చెప్పలేదు. మంచి కథ, డైరక్టర్ దొరికితే హిందీలో సినిమా చేయడానికి మహేష్ కూడా మొన్నటివరకు వెయిట్ చేశాడు. కానీ ఇప్పుడు మహేష్ మనసు మారింది. నో బాలీవుడ్ అంటున్నాడు. సౌత్ లోనే స్థిరపడతానని చెప్పేశాడు. “బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని అనుకోవడం లేదు. ఎందుకంటే […]

నో బాలీవుడ్.. ఫోకస్ అంతా ఇక్కడే
X

తమ అభిమాన హీరో బాలీవుడ్ కు ఎప్పుడు వెళ్తాడా.. హిందీలో ఎప్పుడు సినిమా చేస్తాడా అని సూపర్ స్టార్ అభిమానులు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు. మహేష్ కూడా ఎప్పుడూ బాలీవుడ్ లో సినిమా చేయనని చెప్పలేదు.

మంచి కథ, డైరక్టర్ దొరికితే హిందీలో సినిమా చేయడానికి మహేష్ కూడా మొన్నటివరకు వెయిట్ చేశాడు. కానీ ఇప్పుడు మహేష్ మనసు మారింది. నో బాలీవుడ్ అంటున్నాడు. సౌత్ లోనే స్థిరపడతానని చెప్పేశాడు.

“బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని అనుకోవడం లేదు. ఎందుకంటే సౌత్ సినిమాలే ఇప్పుడు చాలా భారీగా వస్తున్నాయి. సౌత్ లోనే ఓ ఎమేజింగ్ స్టోరీతో ఎమేజింగ్ సినిమా తీస్తే అది ఆటోమేటిగ్గా పాన్ ఇండియా ఫిలిం అయిపోతుంది. రాజమౌళి ఈ విషయాన్ని నిరూపించాడు కదా. ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం సౌత్ సినిమాపైనే. ఇక్కడే మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను.”

ఓ నేషనల్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా కుండబద్దలు కొట్టాడు మహేష్. ఇకపై తన మైండ్ లో బాలీవుడ్ ఆలోచనలు రావని స్పష్టంచేశాడు. మహేష్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనక మరో కారణం కూడా ఉంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో పోటీ తీవ్రంగా ఉంది. కోలీవుడ్, బాలీవుడ్ అంటూ ట్రాక్ మార్చితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. దీనికితోడు మహేష్ కూడా కన్సిస్టెంట్ గా హిట్స్ ఇవ్వడం లేదు. ఒక సినిమా హిట్ అయితే మరో సినిమా ఫ్లాప్ అవుతోంది. అందుకే ఇకపై పూర్తిగా తెలుగులోనే ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు మహేష్.

Next Story