Telugu Global
Cinema & Entertainment

జపాన్ లో మెగా దంపతులు

గత కొంతకాలంగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పీరియడ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి బ్రేక్ తీసుకున్నాడు మెగాస్టార్. ప్రస్తుతం ఆయన జపాన్ లో తన భార్య సురేఖతో హాలిడే ట్రిప్ లో ఉన్నాడు. జపాన్ లోని కొన్ని అందమైన ప్రదేశాలలో వారిద్దరూ కలిసి దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో […]

జపాన్ లో మెగా దంపతులు
X

గత కొంతకాలంగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పీరియడ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.

తాజాగా ఈ చిత్రం నుంచి బ్రేక్ తీసుకున్నాడు మెగాస్టార్. ప్రస్తుతం ఆయన జపాన్ లో తన భార్య సురేఖతో హాలిడే ట్రిప్ లో ఉన్నాడు. జపాన్ లోని కొన్ని అందమైన ప్రదేశాలలో వారిద్దరూ కలిసి దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

జపాన్ నుంచి తిరిగివచ్చాక మెగాస్టార్ చైనా వెళ్ళనున్నారు. అక్కడ కొద్ది రోజులపాటు ‘సైరా’ లోని తదుపరి షూటింగ్ షెడ్యూల్ జరగనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఒకవైపు హీరోగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నప్పటికీ రామ్ చరణ్ ఈ సినిమా నిర్మాణ వ్యవహారాలను కూడా చూసుకుంటున్నాడు.

ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఈ సంవత్సరం దసరాకి విడుదల కానుంది.

Next Story