Telugu Global
NEWS

చంద్రబాబు ప్రభుత్వానికి 100 కోట్ల జరిమానా

కృష్ణానది వద్ద సీఎం నివాసం సమీపంలో ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల జరిమానా విధించింది. రోజుకు 2,500 ట్రక్కుల్లో 25 మీటర్ల లోతు వరకు అక్రమంగా ఇసుకను తవ్వుతున్నారని కేంద్రానికి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ఇచ్చింది.  ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేసిన వాటర్ మాన్ రాజేంద్ర సింగ్, అనుమోలు గాంధీ పిటిషన్‌ను విచారించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వానికి 100 కోట్ల జరిమానా […]

చంద్రబాబు ప్రభుత్వానికి 100 కోట్ల జరిమానా
X

కృష్ణానది వద్ద సీఎం నివాసం సమీపంలో ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల జరిమానా విధించింది.

రోజుకు 2,500 ట్రక్కుల్లో 25 మీటర్ల లోతు వరకు అక్రమంగా ఇసుకను తవ్వుతున్నారని కేంద్రానికి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ఇచ్చింది.

ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేసిన వాటర్ మాన్ రాజేంద్ర సింగ్, అనుమోలు గాంధీ పిటిషన్‌ను విచారించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వానికి 100 కోట్ల జరిమానా విధించింది.

చంద్రబాబు ప్రభుత్వం ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారంలో చాలా చెడ్డపేరు తెచ్చుకున్నది. టీడీపీ నాయకులకు ఇసుక అక్రమ తవ్వకాలే పెద్ద ఆదాయ వనరు అయిపోయింది. ఒక్క ఇసుక అక్రమ దందా మీదనే చాలా మంది టీడీపీ నాయకులు కోటీశ్వరులుగా మారారు.

టీడీపీ నాయకులు ఆర్థికంగా బలవంతులుగా మారితే ఈ ఎన్నికల్లో బాగా డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికల్లో విజయం సాధిస్తారన్న నమ్మకంతో చంద్రబాబు వాళ్ళను స్వేచ్ఛగా వదిలేశాడు, ఇసుక దోపిడీ వ్యవహారంలో.

చింతమనేని ప్రభాకర్‌ ఇసుక దందాకు అడ్డు పడ్డ తహసీల్దార్‌ వనజాక్షి పరిస్థితి ఏమైందో చూశాక…. అధికారులు ఎవ్వరూ ఆ తరువాత అడ్డుపడలేదు. దాంతో టీడీపీ నాయకులు నదుల్లో ఇసుకనంతా అందినకాడికి దోచేశారు. కోట్లకు పడగలెత్తారు.

First Published:  4 April 2019 2:43 AM GMT
Next Story