Telugu Global
Cinema & Entertainment

రాక్షసుడుగా మారిన బెల్లంకొండ శ్రీనివాస్

సీత సినిమా కొలిక్కి రావడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరో సినిమా పనిలో పడ్డాడు హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్. తన పుట్టినరోజు సందర్భంగా రమేష్ వర్మ దర్శకత్వంలో ప్రకటించిన సినిమాను ఇప్పటికే సెట్స్ పైకి తీసుకొచ్చిన బెల్లంకొండ.. ఆ మూవీ టైటిల్ ను తాజాగా ఫిక్స్ చేశాడు. ఈ సినిమాకు రాక్షసుడు అనే టైటిల్ ఫిక్స్ చేశాడు. తమిళ్ లో హిట్ అయిన రాట్ససన్ అనే సినిమాకు రీమేక్ గా ఇది రాబోతోంది. ఇది కంప్లీట్ యాక్షన్ […]

రాక్షసుడుగా మారిన బెల్లంకొండ శ్రీనివాస్
X

సీత సినిమా కొలిక్కి రావడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరో సినిమా పనిలో పడ్డాడు హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్. తన పుట్టినరోజు సందర్భంగా రమేష్ వర్మ దర్శకత్వంలో ప్రకటించిన సినిమాను ఇప్పటికే సెట్స్ పైకి తీసుకొచ్చిన బెల్లంకొండ.. ఆ మూవీ టైటిల్ ను తాజాగా ఫిక్స్ చేశాడు. ఈ సినిమాకు రాక్షసుడు అనే టైటిల్ ఫిక్స్ చేశాడు.

తమిళ్ లో హిట్ అయిన రాట్ససన్ అనే సినిమాకు రీమేక్ గా ఇది రాబోతోంది. ఇది కంప్లీట్ యాక్షన్ మూవీ. తమిళ టైటిల్ అర్థం కూడా రాక్షసుడు అనే వస్తుంది. అందుకే తెలుగులో కూడా అదే టైటిల్ ను కొనసాగించాలని నిర్ణయించారు. రేపు ఈ టైటిల్ ను అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది.

A-స్టుడియోస్ బ్యానర్ పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 2 షెడ్యూల్స్ పూర్తిచేసుకుంది. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. సీత సినిమా విడుదలైన వెంటనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు బయటకొస్తాయి. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించబోతున్నాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్.

First Published:  4 April 2019 3:43 AM GMT
Next Story