Telugu Global
Cinema & Entertainment

సింగర్ గా మారిన నివేదా థామస్

‘జై లవకుశ’ సినిమా తర్వాత ఒక సంవత్సరం సినిమాలకు దూరంగా ఉన్న నివేదా థామస్ ఈ మధ్యనే నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘118’ చిత్రంతో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక ఇప్పుడు నివేదా థామస్ తన టాలెంట్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నివేద థామస్ లో ఒక మంచి నటి, డాన్సర్ మాత్రమే కాక […]

సింగర్ గా మారిన నివేదా థామస్
X

‘జై లవకుశ’ సినిమా తర్వాత ఒక సంవత్సరం సినిమాలకు దూరంగా ఉన్న నివేదా థామస్ ఈ మధ్యనే నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘118’ చిత్రంతో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

ఇక ఇప్పుడు నివేదా థామస్ తన టాలెంట్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నివేద థామస్ లో ఒక మంచి నటి, డాన్సర్ మాత్రమే కాక ఒక మంచి సింగర్ కూడా ఉందని ఈమె పెట్టిన పోస్ట్ ద్వారా తెలుస్తోంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో నివేద వీడియో ఒకటి వైరల్ గా మారుతుంది.

ఈ వీడియోలో నివేద థామస్ రణ్వీర్ సింగ్ ‘గల్లీ బాయ్’ సినిమాలోని ఒక పాటను పాడుతూ కార్ డ్రైవ్ చేస్తూ కనిపిస్తుంది. రణవీర్ సింగ్, అలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో ఈ రాప్ సాంగ్ ను రణ్వీర్ స్వయంగా పాడాడు. ఇప్పుడు ఆ రాప్ ను నివేదా కూడా చాలా చక్కగా పాడటం చూసి అభిమానులు ఆమెపై అభినందనలను కురిపిస్తున్నారు.

ఇక సినిమాల పరంగా చూస్తే నివేదాథామస్ త్వరలో ‘బ్రోచేవారెవరురా’ అనే సినిమాలో కనిపించబోతోంది. ఈ సినిమాలో శ్రీ విష్ణు, సత్యదేవ్ లు కీలక పాత్రలో కనిపించనున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

లింక్:

https://www.instagram.com/p/BvtEjQRAlVQ/

First Published:  2 April 2019 9:37 PM GMT
Next Story