Telugu Global
Cinema & Entertainment

బంగార్రాజు సినిమా పై క్లారిటీ ఇచ్చిన నాగార్జున

ఈ మధ్యనే ‘దేవదాసు’ సినిమాతో డిజాస్టర్ ను అందుకున్న అక్కినేని నాగార్జున తదుపరి సినిమా ఏమిటో అనే ఆసక్తి సర్వత్రా నెలకొన్న సమయంలో నాగార్జున ‘మన్మధుడు 2’ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నాగ్ స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ కోసం పోర్చుగల్ వెళ్లనున్నారు. అయితే కొందరు అక్కినేని అభిమానులు మాత్రం ‘బంగార్రాజు’ సినిమా ఏమైనట్టు అనే ప్రశ్నలు […]

బంగార్రాజు సినిమా పై క్లారిటీ ఇచ్చిన నాగార్జున
X

ఈ మధ్యనే ‘దేవదాసు’ సినిమాతో డిజాస్టర్ ను అందుకున్న అక్కినేని నాగార్జున తదుపరి సినిమా ఏమిటో అనే ఆసక్తి సర్వత్రా నెలకొన్న సమయంలో నాగార్జున ‘మన్మధుడు 2’ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నాగ్ స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ కోసం పోర్చుగల్ వెళ్లనున్నారు.

అయితే కొందరు అక్కినేని అభిమానులు మాత్రం ‘బంగార్రాజు’ సినిమా ఏమైనట్టు అనే ప్రశ్నలు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే నాగార్జున ఒక ఆంగ్ల డైలీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం పై స్పందించారు.

కథ ఆఖరి స్టేజెస్ లో ఉందని, ఇప్పటిదాకా స్క్రిప్ట్ బాగానే వచ్చిందని, స్క్రిప్ట్ పనులు పూర్తవ్వగానే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది అని నాగార్జున క్లారిటీ ఇచ్చారు.

ఈ సినిమా…. నాగార్జున డ్యూయల్ రోల్ లో నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ కి ప్రీక్వెల్ గా వస్తున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. 2016 లో విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయన’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ‘బంగార్రాజు’ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

First Published:  3 April 2019 12:51 AM GMT
Next Story