Telugu Global
Cinema & Entertainment

16 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన మహర్షి

మహర్షి సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ-రిలీజ్ బిజినెస్ ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ కలుపుకొని ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను అటుఇటుగా 110 కోట్ల  రూపాయలకు అమ్ముతున్నారు. మరోవైపు యాడ్-ఆన్ బిజినెస్ పై కూడా దృష్టిసారించింది యూనిట్. ఇందులో భాగంగా ఇప్పటికే ఆడియో రైట్స్ అమ్మేసిన యూనిట్, తాజాగా శాటిలైట్, డిజిటల్ రైట్స్ ను కూడా లాక్ చేసింది. నిజానికి మహర్షి శాటిలైట్ రైట్స్ డీల్ చాన్నాళ్ల కిందటే జెమినీ టీవీకీ ఓకే అయింది. నిర్మాతలకు అడ్వాన్స్ […]

16 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన మహర్షి
X

మహర్షి సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ-రిలీజ్ బిజినెస్ ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ కలుపుకొని ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను అటుఇటుగా 110 కోట్ల రూపాయలకు అమ్ముతున్నారు. మరోవైపు యాడ్-ఆన్ బిజినెస్ పై కూడా
దృష్టిసారించింది యూనిట్. ఇందులో భాగంగా ఇప్పటికే ఆడియో రైట్స్ అమ్మేసిన యూనిట్, తాజాగా శాటిలైట్, డిజిటల్ రైట్స్ ను కూడా లాక్ చేసింది.

నిజానికి మహర్షి శాటిలైట్ రైట్స్ డీల్ చాన్నాళ్ల కిందటే జెమినీ టీవీకీ ఓకే అయింది. నిర్మాతలకు అడ్వాన్స్ ఇచ్చి చర్చలు సాగించారు ఛానెల్ వాళ్లు. అంటే రేటు కాస్త అటు ఇటు అయినా వాళ్లకే రైట్స్ ఇవ్వాలన్నమాట. అలా చాన్నాళ్లు చర్చలు సాగించి ఫైనల్ గా 16 కోట్ల 80 లక్షల రూపాయలకు శాటిలైట్ డీల్ ను లాక్ చేశారట. ఈ మేరకు అగ్రిమెంట్ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది.

మరోవైపు ఈ సినిమా డిజిటల్ రైట్స్ కూడా అమ్ముడుపోయాయి. అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల్ని 11 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. గతంలో ఇదే సంస్థ మహేష్ నటించిన భరత్ అనే నేను డిజిటల్ రైట్స్ ను 10 కోట్లకు
దక్కించుకోగా.. ఇప్పుడు మరో కోటి రూపాయలు అధికంగా మహర్షి ధర పలికింది.

అయితే అంతా అనుకుంటున్నట్టు థియేటర్లలో సినిమా వచ్చిన 4 వారాలకే మహర్షి సినిమా అమెజాన్ ప్రైమ్ లో రాదు. తాజాగా నిబంధనలు మార్చారు. థియేటర్లలో మహర్షి సినిమా వచ్చిన 8 వారాల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ లో వస్తుంది.

First Published:  2 April 2019 6:03 PM GMT
Next Story