Telugu Global
Cinema & Entertainment

మహర్షి కి గుమ్మడికాయ ఎప్పుడు కొడతారో తెలుసా?

మహేష్ బాబు ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న చిత్రం మహర్షి. తన కెరీర్ లో ని 25 వ చిత్రం మహర్షి. ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇప్పటికే సినిమా యూనిట్ చాలా శాతం షూటింగ్ పూర్తి చేసింది. వచ్చే నెల సినిమా రిలీజ్ పెట్టుకొని చిత్ర వర్గాలు ఇంకా షూటింగ్ చేస్తున్నాయి. డబ్బింగ్ పనులు ఇప్పటికే మొదలు కాగా, ఎడిటింగ్ కూడా శరవేగం గా జరుగుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఒక్క చివరి […]

మహర్షి కి గుమ్మడికాయ ఎప్పుడు కొడతారో తెలుసా?
X

మహేష్ బాబు ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న చిత్రం మహర్షి. తన కెరీర్ లో ని 25 వ చిత్రం మహర్షి. ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇప్పటికే సినిమా యూనిట్ చాలా శాతం షూటింగ్ పూర్తి చేసింది. వచ్చే నెల సినిమా రిలీజ్ పెట్టుకొని చిత్ర వర్గాలు ఇంకా షూటింగ్ చేస్తున్నాయి. డబ్బింగ్ పనులు ఇప్పటికే మొదలు కాగా, ఎడిటింగ్ కూడా శరవేగం గా జరుగుతుంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఒక్క చివరి షెడ్యూల్ పెండింగ్ లో ఉంది. అది ఏప్రిల్ 20 నాటికి పూర్తి చేస్తామని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. దుబాయ్ లో ఈ చివరి షెడ్యూల్ షూటింగ్ ఉంటుందట. 21 న హైదరాబాద్ లో ఈ సినిమా కి గుమ్మడికాయ కొట్టనున్నారట దర్శక నిర్మాతలు. మే 9 న సినిమా విడుదల ఉండడం తో సినిమా యూనిట్ అన్ని విధాలా పనులు త్వరితగతిన ముగించుకొని అభిమానుల ని సంతోషపరిచే రేంజ్ లో ప్రమోషన్స్ ని చేయనున్నారని తెలుస్తుంది.

పూజా హెగ్డే ఈ సినిమా లో మహేష్ సరసన నటిస్తుండగా…. అల్లరి నరేష్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం లో దిల్ రాజు ఈ సినిమా ని నిర్మిస్తున్నాడు.

First Published:  3 April 2019 5:14 AM GMT
Next Story