Telugu Global
NEWS

చేతులెత్తేసిన జనసేన.... సభలు రద్దు....

జనసేన పార్టీ ప్రచారంలో చేతులెత్తేసింది. సభలకు ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో మూడు బహిరంగ సభలను రద్దు చేశారు. పెందుర్తి, చోడవరం, అనకాపల్లిలో పవన్‌ కల్యాణ్ సభలు జరగాల్సి ఉంది. అయితే ఇటీవల పవన్ సభలకు జనం రావడం లేదు. నెల్లూరు పర్యటనలోనూ అదే సీన్ ఎదురైంది. పెందుర్తి, చోడవరం, అనకాపల్లిలో సభలకు జనసమీకరణ తమ వల్ల కాదని నేతలు చేతులెత్తేశారు.  దీంతో సభలను రద్దు చేసినట్టు తెలుస్తోంది. పవన్‌ విధానంలో స్పష్టత లేకపోవడం వల్లే ఆఖరిలో ఆయన ప్రచారం దెబ్బతినిపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి […]

చేతులెత్తేసిన జనసేన.... సభలు రద్దు....
X

జనసేన పార్టీ ప్రచారంలో చేతులెత్తేసింది. సభలకు ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో మూడు బహిరంగ సభలను రద్దు చేశారు. పెందుర్తి, చోడవరం, అనకాపల్లిలో పవన్‌ కల్యాణ్ సభలు జరగాల్సి ఉంది.

అయితే ఇటీవల పవన్ సభలకు జనం రావడం లేదు. నెల్లూరు పర్యటనలోనూ అదే సీన్ ఎదురైంది. పెందుర్తి, చోడవరం, అనకాపల్లిలో సభలకు జనసమీకరణ తమ వల్ల కాదని నేతలు చేతులెత్తేశారు.

దీంతో సభలను రద్దు చేసినట్టు తెలుస్తోంది. పవన్‌ విధానంలో స్పష్టత లేకపోవడం వల్లే ఆఖరిలో ఆయన ప్రచారం దెబ్బతినిపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

దీనికి తోడు టీడీపీకి గెలుపు పై నమ్మకం సన్నగిల్లే కొద్దీ తమ ఎత్తుగడలో భాగంగా జనసేనకు అన్ని విధాలుగా సపోర్ట్ తగ్గిస్తూ రావడం వల్ల కూడా జనసేన వెనక్కి తగ్గాల్సిన పరిస్ధితి ఏర్పడుతోందని విశ్లేషకులు అంటున్నారు.

First Published:  2 April 2019 11:52 PM GMT
Next Story