Telugu Global
Health & Life Style

వరాల సిరి.... ఉసిరి

ఉసిరి…. దీనినే ఆమ్లా అని కూడా అంటారు.  ఉసిరి ఆరోగ్యాల సిరి. రుచిలో ఇది పుల్లగా, వగరుగా ఉంటుంది. ఉసిరి బెరడు, కాయ, పండు, ఉసిరి కాయ రసం ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా ఇస్తాయి. ఉసిరి ఆకు లేదా బెరడు నుంచి తీసిన కషాయం త్రిదోషాల నుంచి ఉపశమనం ఇస్తుంది. ఉసిరి ఉపయోగాలు తెలుసుకుందాం. ఉసిరి ఆకు రసం ఉగాది పచ్చడిలా అన్ని రుచులతో మేళవించి ఉంటుంది. అంటే కొద్దిగా పుల్లగా, చేదుగా, వగరుగా, కారంగా ఉంటుంది. […]

వరాల సిరి.... ఉసిరి
X

ఉసిరి…. దీనినే ఆమ్లా అని కూడా అంటారు. ఉసిరి ఆరోగ్యాల సిరి. రుచిలో ఇది పుల్లగా, వగరుగా ఉంటుంది. ఉసిరి బెరడు, కాయ, పండు, ఉసిరి కాయ రసం ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా ఇస్తాయి. ఉసిరి ఆకు లేదా బెరడు నుంచి తీసిన కషాయం త్రిదోషాల నుంచి ఉపశమనం ఇస్తుంది. ఉసిరి ఉపయోగాలు తెలుసుకుందాం.

  • ఉసిరి ఆకు రసం ఉగాది పచ్చడిలా అన్ని రుచులతో మేళవించి ఉంటుంది. అంటే కొద్దిగా పుల్లగా, చేదుగా, వగరుగా, కారంగా ఉంటుంది. ఈ రసాన్ని వేసవిలో తీసుకుంటే శరీరానికి చలువ చేస్తుంది.
  • వేడివల్ల వచ్చే జ్వరం, నీళ్ల విరోచనాలు, అతిసార నుంచి ఉపశమనం చేకూరుస్తుంది.
  • ఉసరి చెట్టు మాను లేదా చెక్కకు కొద్దిగా పసుపు కలిపి నీళ్లతో ఉడికించి, ఆ నీళ్లు చల్లారిన తర్వాత వేసవి కురుపులు కాని… ఇతర కారణాల వల్ల వచ్చే కురుపులపై కాని చల్లితే కురుపులు మాడిపోతాయి.

ఉసిరి పచ్చడి

  • ఉసిరి పచ్చడి జ్వరం తర్వాత నాలుకకు రుచిని పుట్టిస్తుంది.
  • ఉసిరి పచ్చడి మేహశాంతి, పైత్య శాంతి, దేహశాంతికి దోహదపడుతుంది.
  • ఉసిరికాయ త్రిదోషాలను తొలగిస్తుంది. అంటే కఫం, పైత్యం, పొడి దగ్గుల నుంచి దూరం చేస్తుంది. ఉదరం అంటే… పొట్టకు బలాన్ని కలిగిస్తుంది.
  • వికారంగా కాని, తిప్పుతున్నట్లుకాని ఉంటే కొద్దిగా ఉసిరి తొక్కుగాని, ఉసిరి కాయ కాని తింటే ఆ బాధ తగ్గుతుంది.
  • ఉసిరి రసాన్ని రోజూ క్రమం తప్పకుండా కొద్ది మోతాదులో తీసుకుంటే జుట్టు తెల్లబడదు. నిరంతరం నల్లగా ఉంటుంది. అంతే కాదు వయస్సును కూడా నిలుపుతుంది.
  • ఉసిరి కాయ పచ్చిది రసం చేసుకుని తీసుకుంటే సుఖ విరోచనం అవుతుంది. అలాగే అతి దాహాన్ని నియంత్రిస్తుంది.
  • అతివేడి వల్ల మూత్రం రాని వారికి ఉసిరి రసంలో కొద్దిగా తేనె కలిపి ఇస్తే మూత్ర వ్యాధి తగ్గుతుంది.
  • పచ్చి ఉసిరి కాయలను తేనెలో నాన పెట్టి రోజూ ఉదయాన్నే చప్పరిస్తే సర్వ రోగాలు నయం అవుతాయి.
  • ఉసిరి పొడిని కొబ్బరినూనెలో కలిపి రాసుకుంటే జుట్టు నల్లబడడమే కాకుండా మాడుకు చలువ చేసి, జుట్టు కుదుళ్లకు బలాన్ని ఇస్తుంది.
  • అతిసార వ్యాధి కారణంగా విరోచనాలతో బాధపడుతున్న వారికి ఉసిరి పొడిని నీళ్లతో కలిపి తాగిస్తే విరోచనాలు వెంటనే తగ్గుతాయి.
  • ఊరబెట్టిన ఉసిరి కాయలు కంటికి ఎంతో మేలు చేస్తాయి.
  • ఊపిరితిత్తులలో ఉన్న కఫాన్ని బయటకు పంపుతుంది. స్త్రీల సమస్యలకు ఉసిరి పొడి, ఉసిరికాయ అద్భుత ఔషధాలు.
  • నోటి పూతతో బాధపడే వారు ఉసిరి తొక్కును రాసుకున్నా, ఉసిరి రసాన్ని పుక్కిలించినా పూత వెంటనే తగ్గుతుంది.
First Published:  2 April 2019 8:56 PM GMT
Next Story