Telugu Global
Cinema & Entertainment

ఈ వారం సినిమాలు ఇవే!

ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ డల్ గా నడుస్తోంది. సూర్యకాంతం, ఐరా లాంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ తెలంగాణకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఈ వీకెండ్ మరో 3 సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. వీటిలో 2 స్ట్రయిట్ సినిమాలుంటే, ఒకటి డబ్బింగ్ మూవీ. ఈ వీకెండ్ భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఒకేఒక్కటి. అదే మజిలీ. నాగచైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ తర్వాత అందర్నీ ఒక్కసారిగా ఆకట్టుకుంది. అంతలా ఆకట్టుకుంది […]

ఈ వారం సినిమాలు ఇవే!
X

ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ డల్ గా నడుస్తోంది. సూర్యకాంతం, ఐరా లాంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ తెలంగాణకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఈ వీకెండ్ మరో 3 సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. వీటిలో 2 స్ట్రయిట్ సినిమాలుంటే, ఒకటి డబ్బింగ్ మూవీ.

ఈ వీకెండ్ భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఒకేఒక్కటి. అదే మజిలీ. నాగచైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ తర్వాత అందర్నీ ఒక్కసారిగా ఆకట్టుకుంది. అంతలా ఆకట్టుకుంది ఆ ట్రయిలర్. అందుకే సినిమా కోసం చాలామంది వెయిటింగ్. థియేటర్లలో పెద్దగా పోటీ కూడా లేకపోవడంతో, మూవీకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా జనాలు హిట్ చేసి పడేస్తారు. ఇక నాగచైతన్యదే ఆలస్యం.

మజిలీతో పాటు వస్తున్న మరో స్ట్రయిట్ మూవీ ప్రేమకథాచిత్రమ్-2. మజిలీ రిలీజైన 24 గంటల తర్వాత, అంటే ఉగాది కానుకగా శనివారం థియేటర్లలోకి రాబోతోంది ఈ సినిమా. సుమంత్ అశ్విన్, నందిత శ్వేత, సిద్ధి ఇద్నానీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా హిలేరియస్ గా ఉంటుందంటోంది యూనిట్.

ఇక ఈ వారం ఓ డబ్బింగ్ సినిమా కూడా రెడీ అయింది. 2 వారాల కిందట వేర్ ఈజ్ వెంకటలక్ష్మీతో ప్రేక్షకుల్ని పలకరించిన లక్ష్మీరాయ్, ఈ సారి సంజనరెడ్డిగా వస్తోంది. తమిళంలో రాయ్ లక్ష్మి నటించిన ఒంబదులే గురు చిత్రానికి తెలుగు వెర్షన్ ఇది. సెల్వకుమార్ దర్శకుడు. వాణీ వెంకటరమణ సినిమాస్ పతాకంపై నిర్మాత రవీంద్ర కల్యాణ్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న ఈ 3 సినిమాల్లో మజిలీపై మాత్రమే అంచనాలున్నాయి.

First Published:  3 April 2019 10:00 AM GMT
Next Story