Telugu Global
Cinema & Entertainment

బాలీవుడ్ నటిని శశికళ గా మార్చనున్న వర్మ

ఈ మధ్యనే నందమూరి తారకరామారావు బయోపిక్ పేరుతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల చేసిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం మరో బయోపిక్ తెరకెక్కించే పనిలో పడ్డ సంగతి తెలిసిందే. ఈ మధ్యనే సోషల్ మీడియా ద్వారా తన తదుపరి ప్రాజెక్టు తమిళనాడు మాజీ సీఎం జయలలితకి సన్నిహితురాలైన శశికళ జీవిత చరిత్ర పై తీయబోతున్నట్లు తెలియజేశాడు. ఈ చిత్ర పోస్టర్ ని సైతం విడుదల చేశాడు వర్మ. తాజా సమాచారం ప్రకారం ఈ […]

బాలీవుడ్ నటిని శశికళ గా మార్చనున్న వర్మ
X

ఈ మధ్యనే నందమూరి తారకరామారావు బయోపిక్ పేరుతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల చేసిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం మరో బయోపిక్ తెరకెక్కించే పనిలో పడ్డ సంగతి తెలిసిందే.

ఈ మధ్యనే సోషల్ మీడియా ద్వారా తన తదుపరి ప్రాజెక్టు తమిళనాడు మాజీ సీఎం జయలలితకి సన్నిహితురాలైన శశికళ జీవిత చరిత్ర పై తీయబోతున్నట్లు తెలియజేశాడు. ఈ చిత్ర పోస్టర్ ని సైతం విడుదల చేశాడు వర్మ.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో శశికళ పాత్ర కోసం ఒక బాలీవుడ్ నటిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో దాదాపు అందరినీ కొత్త నటీనటులను తీసుకున్నాడు ఆర్జీవి. కానీ శశికళ బయోపిక్ లో మాత్రం తెలిసిన మొహాలతో సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో శశికళ పాత్ర మాత్రమే కాక జయలలిత పాత్రలో కూడా ఎవరు కనిపించనున్నారు అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఇక ఈ చిత్రాన్ని పక్కన పెడితే ఇప్పటికే ఇద్దరు దర్శకులు జయలలిత బయోపిక్ లను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ‘ది ఐరన్ లేడీ’ అనే టైటిల్ తో ప్రియదర్శిని దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న జయలలిత బయోపిక్ లో నిత్యామీనన్ జయలలిత పాత్ర పోషిస్తోంది.

Next Story