Telugu Global
Cinema & Entertainment

అభిమానులకి ఉగాది కానుక ఇవ్వబోతున్న సూపర్ స్టార్ 

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘మహర్షి’ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అల్లరి నరేష్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం గురించి వచ్చిన ప్రతి అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు తన పాత్ర కోసం […]

అభిమానులకి ఉగాది కానుక ఇవ్వబోతున్న సూపర్ స్టార్ 
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘మహర్షి’ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అల్లరి నరేష్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం గురించి వచ్చిన ప్రతి అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు తన పాత్ర కోసం డబ్బింగ్ పనులను పూర్తి చేశాడట. తాజాగా ఈ టీజర్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ‘మహర్షి’ చిత్ర టీజర్ ను దర్శకనిర్మాతలు ఉగాది కానుకగా ఏప్రిల్ 6వ తారీకున విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

ఇప్పటికే విడుదలైన చోటి చోటి బాతే సాంగ్ కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో టీజర్ కూడా విడుదల అయితే ఈ చిత్రానికి మరింత హైప్ పెరుగుతుంది.

దిల్ రాజు, పీవీపీ, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా మీ 9వ తారీఖున వేసవిలో విడుదల కానుంది.

First Published:  2 April 2019 7:10 AM GMT
Next Story