Telugu Global
Cinema & Entertainment

బయోపిక్... కంగనా కండిషన్లు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, పాతతరం స్టార్ హీరోయిన్ జయలలిత జీవితం బయోపిక్ గా రాబోతున్న విషయం తెలిసిందే. విష్ణు ఇందూరి నిర్మాణంలో ఏఎల్  విజయ్ డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో జయలలిత పాత్రను కంగనా రనౌత్ పోషించనుంది. ఇప్పటివరకు అంతా ఓకే కానీ, అసలు విషయం దగ్గర మాత్రం కండిషన్లు పెడుతోంది కంగన. జయలలిత పాత్ర కోసం లావెక్కేది లేదని తెగేసి చెప్పేసింది. రియల్ లైఫ్ లో జయలలిత కాస్త బొద్దుగా ఉండేవారు. హీరోయిన్ గా ఉన్నప్పట్నుంచే ఆమె కాస్త […]

బయోపిక్... కంగనా కండిషన్లు
X

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, పాతతరం స్టార్ హీరోయిన్ జయలలిత జీవితం బయోపిక్ గా రాబోతున్న విషయం తెలిసిందే. విష్ణు ఇందూరి నిర్మాణంలో ఏఎల్ విజయ్ డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో జయలలిత పాత్రను కంగనా రనౌత్
పోషించనుంది. ఇప్పటివరకు అంతా ఓకే కానీ, అసలు విషయం దగ్గర మాత్రం కండిషన్లు పెడుతోంది కంగన. జయలలిత పాత్ర కోసం లావెక్కేది లేదని తెగేసి చెప్పేసింది.

రియల్ లైఫ్ లో జయలలిత కాస్త బొద్దుగా ఉండేవారు. హీరోయిన్ గా ఉన్నప్పట్నుంచే ఆమె కాస్త బొద్దు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా లావెక్కారు. సో.. ఆమె పాత్ర పోషించాలంటే బక్కపలచగా ఉండే కంగనా కూడా లావెక్కాల్సిందే. అది మాత్రం తనవల్ల కాదని చెప్పేసింది కంగన. ఏమైనా చేస్తాను కానీ లావెక్కడం మాత్రం తన వల్ల కాదని తెగేసి చెప్పేసింది.

స్లిమ్ గా ఉంటే చాలా అందం, ఆరోగ్యం. అదే లావెక్కితే తగ్గడం చాలా కష్టం. మొన్నటికిమొన్న బరువు తగ్గడం కోసం అనుష్క అష్టకష్టాలు పడిన సంగతి తెలిసిందే. అందుకే కంగన లావెక్కడానికి ఇష్టపడలేదు. మేకప్, ప్రోస్తటిక్స్, గ్రాఫిక్స్ సహాయంతో
కంగనాను లావుగా చూపించాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు.

First Published:  2 April 2019 10:31 AM GMT
Next Story