Telugu Global
Cinema & Entertainment

డైరెక్టర్ వంశీ.... ఆటో బయోగ్రఫీ....

టాలీవుడ్ లోని సీనియర్ మోస్ట్ దర్శకులలో వంశీ కూడా ఒకరు. ఆయన గతంలో మంచుపల్లకి, సితార, అన్వేషణ, ప్రేమించు పెళ్ళాడు, లేడీస్ టైలర్, చెట్టు కింద ప్లీడర్, ఏప్రిల్ 1 విడుదల, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, గోపి గోపిక గోదావరి…. ఇలా ఎన్నో మంచి సినిమాలను తెరకెక్కించారు. బోలెడు సూపర్ హిట్ సినిమాలను అందించిన వంశీకి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే గత కొంత కాలంగా ఈయన సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి […]

డైరెక్టర్ వంశీ.... ఆటో బయోగ్రఫీ....
X

టాలీవుడ్ లోని సీనియర్ మోస్ట్ దర్శకులలో వంశీ కూడా ఒకరు. ఆయన గతంలో మంచుపల్లకి, సితార, అన్వేషణ, ప్రేమించు పెళ్ళాడు, లేడీస్ టైలర్, చెట్టు కింద ప్లీడర్, ఏప్రిల్ 1 విడుదల, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, గోపి గోపిక గోదావరి…. ఇలా ఎన్నో మంచి సినిమాలను తెరకెక్కించారు.

బోలెడు సూపర్ హిట్ సినిమాలను అందించిన వంశీకి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే గత కొంత కాలంగా ఈయన సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఇక వంశీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రిటైర్ అవుదామని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ దర్శకుడు ప్రస్తుతం తన స్వీయ చరిత్రను రాసే పనిలో పడ్డాడట.

‘పొలమారిన జ్ఞాపకాలు’ అనే ఆసక్తికరమైన టైటిల్ తో ఈ ఆటో బయోగ్రఫీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

అయితే దర్శకుడిగానే కాక వంశీ మంచి రైటర్ గా కూడా పేరు తెచ్చుకున్నారు. బోలెడు కథలు, నవలలు, సీరియల్స్ కూడా రాసిన వంశీ ఇప్పుడు తన స్వీయ చరిత్రను స్వహస్తాలతో రాయనున్నారు. ఇది ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి ప్రస్తుతం అందరిలోనూ నెలకొంది.

Next Story