Telugu Global
NEWS

ఇక “స్టార్” ప్రచారం ప్రారంభం...!

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక సభ ఎన్నికల సమయం దగ్గర పడింది. సమరానికి అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్షం వై. ఎస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన జనసేన తమ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. జాతీయ నాయకులతో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తమ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చిన మమతా బెనర్జీ, కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లా వంటి నాయకుల ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఓటర్లపై పెద్దగా పడలేదని అంటున్నారు. గత ఎన్నికలలో తెలుగు […]

ఇక “స్టార్” ప్రచారం ప్రారంభం...!
X

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక సభ ఎన్నికల సమయం దగ్గర పడింది. సమరానికి అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్షం వై. ఎస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన జనసేన తమ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి.

జాతీయ నాయకులతో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తమ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చిన మమతా బెనర్జీ, కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లా వంటి నాయకుల ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఓటర్లపై పెద్దగా పడలేదని అంటున్నారు.

గత ఎన్నికలలో తెలుగు సినీ పరిశ్రమ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసిన వారెవరూ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకడం లేదు.

ప్రముఖ సినీ నటులు బాలకృష్ణ, మురళీమోహన్ కోడలు మాగంటి రూప తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. వారిద్దరి తరఫున ప్రచారం చేసేందుకు సినీ రంగానికి చెందిన వారు ఇప్పటి వరకు ఎవరూ రాలేదు.

తెలుగు సినీ పరిశ్రమ తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని పూర్తిగా వదిలించుకుందామని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

దీంతో తెలుగుదేశం పార్టీకి సినీ గ్లామర్ ఏమి పని చేయడం లేదు. ఇక సినీ హీరో పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ జనసేన నుంచి ఆయన సోదరుడు నాగబాబు లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్నారు. వారిద్దరూ మినహా సినీ రంగానికి చెందిన వారెవ్వరూ ఆ పార్టీ తరఫున ప్రచారం చేసే అవకాశాలు లేవు అంటున్నారు.

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, కమెడియన్ లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు, దర్శక, నిర్మాతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల మొగ్గుచూపుతున్నారు. వీరిలో చాలా మంది ఇప్పటికే ఆ పార్టీలో చేరిపోయారు. కమెడియన్ ఆలీ, పృథ్వి, అలనాటి హీరో, హీరోయిన్ లు మోహన్ బాబు, జయసుధ, రాజశేఖర్, జీవిత ఒకటి రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

వీరితో పాటుగా శివాజీ రాజా, విజయ్ చందర్, హేమ, క్రిష్ణుడు, పోసాని క్రిష్ణమురళి సహా మరికొందరు స్టార్లతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేయనుంది.

ఈ సినీ స్టార్స్ ను ఏ ఏ జిల్లాలకు ప్రచారం కోసం పంపించాలో కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకటి, రెండు రోజుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ “స్టార్ట్… కెమెరా… ప్రచారం…” నినాదాన్ని ప్రకటించనుంది.

First Published:  1 April 2019 9:32 PM GMT
Next Story