Telugu Global
Cinema & Entertainment

అప్పుడు ఒప్పుకోలేదు... కానీ ఇప్పుడు ఒప్పుకున్న సమంత

మోహన్ కృష్ణ ఇంద్రగంటి జెంటిల్ మన్  సినిమా తర్వాత నుండి స్పీడ్ పెంచాడు. ఈ సినిమా విజయం దర్శకుడి లో నమ్మకం చాలా పెంచింది. ఆ తర్వాత వరుస విజయాలు సాధించిన ఈ దర్శకుడు ప్రస్తుతం నాని, సుధీర్ బాబు ల తో ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ని రూపొందించాలని అనుకుంటున్నాడు. నాని తో ఇప్పటికే రెండు విజయాలు అందుకున్న మోహన్…. సుధీర్ బాబు తో కూడా సమ్మోహనం తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు ఈ […]

అప్పుడు ఒప్పుకోలేదు... కానీ ఇప్పుడు ఒప్పుకున్న సమంత
X

మోహన్ కృష్ణ ఇంద్రగంటి జెంటిల్ మన్ సినిమా తర్వాత నుండి స్పీడ్ పెంచాడు. ఈ సినిమా విజయం దర్శకుడి లో నమ్మకం చాలా పెంచింది. ఆ తర్వాత వరుస విజయాలు సాధించిన ఈ దర్శకుడు ప్రస్తుతం నాని, సుధీర్ బాబు ల తో ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ని రూపొందించాలని అనుకుంటున్నాడు.

నాని తో ఇప్పటికే రెండు విజయాలు అందుకున్న మోహన్…. సుధీర్ బాబు తో కూడా సమ్మోహనం తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరి హీరోల తో కలిసి సినిమా చేస్తుండడంతో ఎక్కడా లేని ఆసక్తి ఈ సినిమా పై వచ్చి చేరింది.

ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ల ఎంపిక జరుగుతుంది. మొన్నా మధ్య ఒక సినిమా కోసం నాని సరసన సమంత ని నటించమంటే సమంత నో చెప్పేసిందట. కారణం తెలీదు కానీ ఆ సినిమాను సమంత ఒప్పుకోలేదు. ఇప్పుడు ఈ సినిమా కోసం నాని సరసన సమంత ని పెట్టాలని అప్రోచ్ అయితే వెంటనే ఒప్పుకుందని టాక్.

సమంత కి ఈ సినిమా కథ, అందులో తన పాత్ర నచ్చేసిందట. అందుకే ఈ సినిమాను ఒప్పుకుందట. ఈ సినిమా ని క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.

First Published:  1 April 2019 4:23 AM GMT
Next Story