Telugu Global
Cinema & Entertainment

"ఆర్ డీ ఎక్స్" పేల్చనున్న పాయల్ !

RX100 చిత్రం తో అమాంతం క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. తన మొదటి చిత్రంతోనే అమాంతంగా అభిమానాన్ని సంపాదించిన పాయల్…. ఏ చిత్రం పడితే ఆ చిత్రం కాకుండా తదుపరి చిత్రం కోసం ఆచి తూచి అడుగులు వేస్తుంది ఈ అందాల భామ. అయితే తాజా గా పాయల్ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది అని టాక్. తన అందచందాల తో ప్రేక్షకులని మంత్ర ముగ్ధుల్ని చేసిన పాయల్ తన తదుపరి […]

ఆర్ డీ ఎక్స్ పేల్చనున్న పాయల్ !
X

RX100 చిత్రం తో అమాంతం క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. తన మొదటి చిత్రంతోనే అమాంతంగా అభిమానాన్ని సంపాదించిన పాయల్…. ఏ చిత్రం పడితే ఆ చిత్రం కాకుండా తదుపరి చిత్రం కోసం ఆచి తూచి అడుగులు వేస్తుంది ఈ అందాల భామ.

అయితే తాజా గా పాయల్ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది అని టాక్. తన అందచందాల తో ప్రేక్షకులని మంత్ర ముగ్ధుల్ని చేసిన పాయల్ తన తదుపరి చిత్రాన్ని సైన్ చేసింది.

సి కళ్యాణ్ నిర్మాణ సారథ్యం లో రాబోతున్న ఒక చిత్రం లో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్ర పోషించనుంది. ఈ సినిమా ని దర్శక నిర్మాతలు అధికారికం గా లాంచ్ చేశారు కూడా.

ఈ సినిమా కి ”ఆర్ డీ ఎక్స్” అనే పేరుని కూడా ఖరారు చేశారు. మంచి క్యాచీ టైటిల్ ని పెట్టిన దర్శక నిర్మాతలు…. కాంప్రమైస్ కాకుండా సినిమా ని భారీ స్థాయి లో తీయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. శంకర్ భాను ఈ చిత్రానికి దర్శకుడు. రధన్ ఈ చిత్రానికి స్వరాలని సమకూర్చనున్నాడు. ఈ సినిమా కాకుండా పాయల్ రవి తేజ తో ఒక సినిమా, నాగార్జున తో ఒక సినిమా తో బిజీ గా ఉంది.

First Published:  1 April 2019 4:39 AM GMT
Next Story