Telugu Global
Cinema & Entertainment

మజిలీ ట్రయిలర్... మోస్ట్ ఎమోషనల్

అదేంటో కానీ కొన్ని సినిమాలకు విడుదలకు ముందు నుంచే పాజిటివ్ టాక్ ప్రారంభమైపోతుంది. థియేటర్లలోకి వచ్చిన తర్వాత యావరేజ్ గా ఉన్నప్పటికీ హిట్ అయిపోతుంది. సరిగ్గా ఆ కోవలోకే వస్తుంది మజిలీ సినిమా. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ట్రయిలర్ విడుదల చేశారు. ఆ ట్రయిలర్ చూసిన తర్వాత సినిమా గ్యారెంటీ హిట్ అనే టాక్ వచ్చేసింది. మోస్ట్ ఎమోషనల్ గా ఉంది మజిలీ ట్రయిలర్. భార్యాభర్తల మధ్య అనుబంధం, […]

మజిలీ ట్రయిలర్... మోస్ట్ ఎమోషనల్
X

అదేంటో కానీ కొన్ని సినిమాలకు విడుదలకు ముందు నుంచే పాజిటివ్ టాక్ ప్రారంభమైపోతుంది. థియేటర్లలోకి వచ్చిన తర్వాత యావరేజ్ గా ఉన్నప్పటికీ హిట్ అయిపోతుంది. సరిగ్గా ఆ కోవలోకే వస్తుంది మజిలీ సినిమా. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ట్రయిలర్ విడుదల చేశారు. ఆ ట్రయిలర్ చూసిన తర్వాత సినిమా గ్యారెంటీ హిట్ అనే టాక్ వచ్చేసింది.

మోస్ట్ ఎమోషనల్ గా ఉంది మజిలీ ట్రయిలర్. భార్యాభర్తల మధ్య అనుబంధం, భర్త పడే యాతన, భర్త కోసం భార్య తపన, మధ్యలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. ఇలా ఏ యాంగిల్ లో చూసినా మజిలీ ట్రయిలర్ హార్ట్ టచింగ్ గా ఉంది. ట్రయిలర్ చూసిన వెంటనే సినిమా కచ్చితంగా హిట్ అంటున్నారంటే, ఈ ట్రయిలర్ ఎంతలా ఆడియన్స్ కు కనెక్ట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

రియల్ లైఫ్ భార్యాభర్తలు సమంత, నాగచైతన్య కలిసి నటించిన నాలుగో సినిమా ఇది. పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న తొలి సినిమా ఇదే. గతంలో నిన్న కోరి లాంటి ఎమోషనల్ మూవీని ప్రేక్షకులకు అందించిన శివ నిర్వాణ, ఇప్పుడు తన రెండో సినిమా మజిలీ కోసం కూడా అలాంటిదే మరో ఎమోషనల్ సబ్జెక్ట్ సెలక్ట్ చేసుకున్నాడనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది. తమన్ ఈ సినిమాకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. గోపీసుందర్ పాటలు కంపోజ్ చేశాడు.

First Published:  1 April 2019 7:20 AM GMT
Next Story