Telugu Global
Cinema & Entertainment

ఏపీలో "లక్ష్మీస్ ఎన్టీఆర్" హల్ చల్

అదేంటి.. ఆంధ్రప్రదేశ్ లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల కాలేదు కదా.. మరి హల్ చల్ ఎలా అవుతుందనేగా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం. ఏపీ థియేటర్లలోకి సినిమా రాకపోయినా, ఆంధ్రా ప్రేక్షకుల మొబైల్స్ లోకి మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ వచ్చేసింది. అవును.. ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో క్లిప్పింగులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ లో కీలకమైన వెన్నుపోటు ఉదంతం, వైశ్రాయ హోటల్, ఎన్టీఆర్ మరణం లాంటి సన్నివేశాలు […]

ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ హల్ చల్
X

అదేంటి.. ఆంధ్రప్రదేశ్ లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల కాలేదు కదా.. మరి హల్ చల్ ఎలా అవుతుందనేగా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం. ఏపీ థియేటర్లలోకి సినిమా రాకపోయినా, ఆంధ్రా ప్రేక్షకుల మొబైల్స్ లోకి మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ వచ్చేసింది. అవును.. ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో క్లిప్పింగులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరీ ముఖ్యంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ లో కీలకమైన వెన్నుపోటు ఉదంతం, వైశ్రాయ హోటల్, ఎన్టీఆర్ మరణం లాంటి సన్నివేశాలు ఏపీ ప్రేక్షకుల మొబైల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్.. ఇలా తేడా లేకుండా ఎక్కడ చూసినా లక్ష్మీస్ ఎన్టీఆర్ క్లిప్పింగులే దర్శనమిస్తున్నాయి. వీటిని చూసిన ఏపీ ఆడియన్స్, చంద్రబాబు నిజస్వరూపాన్ని పూర్తిగా తెలుసుకుంటున్నారు.

నిజానికి తమ సినిమా పైరసీ బారిన పడితే మేకర్స్ చాలా బాధపడతారు. పైరసీని ఆపండి బాబోయ్ అంటూ గగ్గోలుపెడతారు. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాతలు మాత్రం హ్యాపీగా ఉన్నారు. సరైన టైమ్ లో తెలుగు ప్రేక్షకులకు సినిమా అందినందుకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హ్యాపీగా ఫీలయ్యాడు.

ఈ సినిమాను ఏపీలో రిలీజ్ చేయకుండా స్టే విధించిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు ఈ సినిమాను ఆపాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. ఎలాగైనా ఎన్నికల టైమ్ కు సినిమాను విడుదల చేసి తీరాలని మేకర్స్ భావిస్తున్నారు. అంతలోనే ఈ సినిమాలో కీలకమైన ఎపిసోడ్లు వాట్సాప్ లో ప్రత్యక్షమై, ఏపీ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి.

Next Story