Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్ " దిల్ రాజు " సమంత

ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రీకరణ లో తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఒక వైపు సాహో షెడ్యూల్ పూర్తి చేసుకొని వెంటనే రాధ కృష్ణ కుమార్ దర్శకత్వం లో చేస్తున్న సినిమా షూటింగ్ కి హాజరు కానున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ముందు ఈ రెండు సినిమాలే ఉన్నాయి. వీటి తర్వాత పెళ్ళి మీదకి ధ్యాస పెట్టేలా ఉన్నాడు ప్రభాస్. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ మరొక సినిమాని లైన్ లో పెట్టె పనిలో ఉన్నాడట. ఎప్పుడో […]

ప్రభాస్  దిల్ రాజు  సమంత
X

ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రీకరణ లో తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఒక వైపు సాహో షెడ్యూల్ పూర్తి చేసుకొని వెంటనే రాధ కృష్ణ కుమార్ దర్శకత్వం లో చేస్తున్న సినిమా షూటింగ్ కి హాజరు కానున్నాడు.

ప్రస్తుతం ఈ హీరో ముందు ఈ రెండు సినిమాలే ఉన్నాయి. వీటి తర్వాత పెళ్ళి మీదకి ధ్యాస పెట్టేలా ఉన్నాడు ప్రభాస్. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ మరొక సినిమాని లైన్ లో పెట్టె పనిలో ఉన్నాడట. ఎప్పుడో దిల్ రాజు కి సినిమా చేస్తా అని మాట ఇచ్చాడట ప్రభాస్.

మిస్టర్ పర్ఫెక్ట్ సక్సెస్ తర్వాత వీళ్ళు కలిసి పని చేయాల్సింది. కానీ అది వర్క్ అవ్వలేదు. అయితే ఇటీవలే దిల్ రాజు ఒక కథ విన్నాడట. ఆ కథ కి ప్రభాస్, సమంత అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతారని దిల్ రాజు భావిస్తున్నాడు. అందుకనే వెంటనే ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించే ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ మెగా ప్రొడ్యూసర్.

సమంత తో ప్రస్తుతం దిల్ రాజు సినిమా చేస్తున్నాడు కాబట్టి ఆవిడకి త్వరలో కథ ని చెప్పనున్నాడు. అలాగే ప్రభాస్ ని కూడా త్వరలో నే కలిసి దిల్ రాజు కథ ని వినిపించే పని లో ఉన్నాడట.

First Published:  1 April 2019 4:15 AM GMT
Next Story