Telugu Global
Cinema & Entertainment

దేవి మ్యూజిక్... అఖిల్ ను కాపాడుతుందా?

అఖిల్ అక్కినేని తన కెరీర్ లో ఇప్పటికే మూడు చిత్రాలు చేసాడు. కానీ ఒక సినిమాను మించి మరో సినిమా డిజాస్టర్లుగా నిలిచాయి. అయినా ఈ అక్కినేని హీరో తన తదుపరి చిత్రానికి సంబంధించిన పనులలో బిజీ బిజీ గా ఉన్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం అఖిల్ నాలుగో చిత్రానికి దర్శకుడి గా బొమ్మరిల్లు భాస్కర్ ఉండబోతున్నాడని టాక్. ఒంగోలు గిత్త తర్వాత తెలుగు సినిమాలకి గుడ్ బై చెప్పేసిన భాస్కర్ చాలా కాలం తర్వాత […]

దేవి మ్యూజిక్... అఖిల్ ను కాపాడుతుందా?
X

అఖిల్ అక్కినేని తన కెరీర్ లో ఇప్పటికే మూడు చిత్రాలు చేసాడు. కానీ ఒక సినిమాను మించి మరో సినిమా డిజాస్టర్లుగా నిలిచాయి. అయినా ఈ అక్కినేని హీరో తన తదుపరి చిత్రానికి సంబంధించిన పనులలో బిజీ బిజీ గా ఉన్నాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం అఖిల్ నాలుగో చిత్రానికి దర్శకుడి గా బొమ్మరిల్లు భాస్కర్ ఉండబోతున్నాడని టాక్. ఒంగోలు గిత్త తర్వాత తెలుగు సినిమాలకి గుడ్ బై చెప్పేసిన భాస్కర్ చాలా కాలం తర్వాత మళ్ళీ తెలుగు లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఫిలిం నగర్ వార్తల ప్రకారం అఖిల్ ఈ సినిమా కి పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ని ప్రిఫర్ చేస్తున్నాడట.

తన మొదటి మూడు చిత్రాలకు మ్యూజిక్ ఇచ్చిన డైరెక్టర్ లను కాకుండా …. ఈ సారి అఖిల్… దేవి శ్రీ ప్రసాద్ ని తీసుకుంటున్నాడట. దేవి శ్రీ అయితే సినిమాకు మంచి బజ్ వస్తుందని అనుకుంటున్నాడట.

దేవి శ్రీ సంగీతం అందించిన మహర్షి లో ని మెదటి సింగిల్ ని ఈమధ్యే రిలీజ్ చేశారు.

మరి ఈసారైనా అఖిల్ కు… దేవిశ్రీ కాంబినేషన్ లో హిట్ అందుతుందో లేదో చూడాలి..!

Next Story