Telugu Global
Cinema & Entertainment

'సీత' టీజర్.... "చచ్చిపో చచ్చిపో" అంటున్న కాజల్

వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ మధ్యనే ‘కవచం’ సినిమాతో మరో డిజాస్టర్ ను అందుకున్నాడు. తాజాగా ‘కవచం’ సినిమాలో హీరోయిన్ గా నటించిన కాజల్ అగర్వాల్ తో ఈ సారి ‘సీత’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తేజ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇప్పటిదాకా చిత్ర పోస్టర్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆ చిత్ర బృందం ఇప్పుడు సినిమా టీజర్ ను ఇవాళ విడుదల చేసింది. […]

సీత టీజర్.... చచ్చిపో చచ్చిపో అంటున్న కాజల్
X

వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ మధ్యనే ‘కవచం’ సినిమాతో మరో డిజాస్టర్ ను అందుకున్నాడు.

తాజాగా ‘కవచం’ సినిమాలో హీరోయిన్ గా నటించిన కాజల్ అగర్వాల్ తో ఈ సారి ‘సీత’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తేజ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఇప్పటిదాకా చిత్ర పోస్టర్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆ చిత్ర బృందం ఇప్పుడు సినిమా టీజర్ ను ఇవాళ విడుదల చేసింది. కేవలం ఒక్క నిమిషం వీడియో ద్వారా సినిమా ఎలా ఉండబోతోందో అనే హింట్ ను కూడా ఇచ్చారు.

టీజర్ చూస్తే కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో ఒక నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది. కానీ మరోవైపు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాత్రం ఒక ఇన్నోసెంట్ అబ్బాయి రఘురామ్ పాత్రలో కనిపించనున్నాడు.

టీజర్ చూస్తే రఘు రామ్ సీత కి బాడీగార్డ్ గా వ్యవహరిస్తారు అని చెప్పుకోవచ్చు. అలాగే వీరిద్దరి మధ్య ఏదో గొడవ కూడా జరిగినట్టు ఉంది. టీజర్ లో బెల్లంకొండ పై కాజల్ “చచ్చిపో చచ్చిపో” అని అరుస్తుంది.

అసలు వీరిద్దరి కథ ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. రాంబ్రహ్మం సుంకర ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.

First Published:  31 March 2019 2:17 AM GMT
Next Story