Telugu Global
Cinema & Entertainment

అఖిల్ దగ్గర నుండి నాగచైతన్య నేర్చుకున్నది ఇదేనట

మాములుగా అన్నయ్య అంటే తమ్ముడికి అన్నీ నేర్పిస్తూ ఉంటాడు. కానీ తమ్ముడి దగ్గర నుండి కూడా అన్నయ్యలు నేర్చుకునే సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఆ పరిస్థితి అక్కినేని వారసుడు నాగ చైతన్య కి కూడా ఏర్పడింది. పెళ్లయిన తర్వాత మొట్టమొదటి సారిగా నాగచైతన్య తన భార్య సమంతతో కలిసి ‘మజిలీ’ సినిమా లో నటించాడు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 5న విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్ లో […]

అఖిల్ దగ్గర నుండి నాగచైతన్య నేర్చుకున్నది ఇదేనట
X

మాములుగా అన్నయ్య అంటే తమ్ముడికి అన్నీ నేర్పిస్తూ ఉంటాడు. కానీ తమ్ముడి దగ్గర నుండి కూడా అన్నయ్యలు నేర్చుకునే సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఆ పరిస్థితి అక్కినేని వారసుడు నాగ చైతన్య కి కూడా ఏర్పడింది.

పెళ్లయిన తర్వాత మొట్టమొదటి సారిగా నాగచైతన్య తన భార్య సమంతతో కలిసి ‘మజిలీ’ సినిమా లో నటించాడు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 5న విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా నాగచైతన్య తాను అఖిల్ వద్ద నుంచి క్రికెట్ టిప్స్ నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు.

ఈ చిత్ర టీజర్ చూస్తే చై ఈ సినిమాలో ఒక క్రికెటర్ పాత్ర పోషించబోతున్నాడు అని తెలుస్తోంది. “నాకు క్రికెట్ అస్సలు రాదు. ఎప్పుడో చిన్నప్పుడు ఆడాను. కానీ ఆ తర్వాత బ్యాట్ పట్టుకొని చాలాకాలమయింది. కానీ అఖిల్ ఎప్పుడూ క్రికెట్ ధ్యాసలోనే ఉంటాడు. అందుకే అఖిల్ వద్దనుండి ఒక క్రికెటర్ లైఫ్ స్టైల్, గ్రౌండ్ లో ఒక క్రికెటర్ ఆలోచనల గురించి టిప్స్ తెలుసుకున్నాను” అని చెప్పుకొచ్చాడు నాగచైతన్య. అంతేకాక ఈ సినిమాలో తన పాత్ర కోసం కొంతమంది రంజీ ప్లేయర్స్ వద్ద కూడా కోచింగ్ తీసుకున్నాడు చైతూ. శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

First Published:  31 March 2019 8:07 AM GMT
Next Story