Telugu Global
Cinema & Entertainment

దిల్ రాజు కి హెచ్చరికలు జారీ చేసిన మహేష్ అభిమానులు

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా ‘ఎఫ్ 2’. సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బాలీవుడ్ లొ కూడా నిర్మాతగా అడుగుపెట్టనున్న దిల్ రాజు ‘ఎఫ్ 2’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారన్న విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కనున్న హిందీ రీమేక్ […]

దిల్ రాజు కి హెచ్చరికలు జారీ చేసిన మహేష్ అభిమానులు
X

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా ‘ఎఫ్ 2’. సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు బాలీవుడ్ లొ కూడా నిర్మాతగా అడుగుపెట్టనున్న దిల్ రాజు ‘ఎఫ్ 2’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారన్న విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కనున్న హిందీ రీమేక్ కి ‘నో ఎంట్రీ’, ‘సింగ్ ఈజ్ కింగ్’, ‘రెడీ ఇన్ ది పాస్ట్’ వంటి కామెడీ చిత్రాలకు దర్శకత్వం వహించిన అనీస్ బాజ్మీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

తెలుగులో హిట్ అయిన ఈ సినిమా హిందీలో కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. అయితే మహేష్ అభిమానులు మాత్రం ఈ విషయంలో కొంత దిగులు చెందుతున్నారట.

‘ఎఫ్ 2’ ఎలాగో బ్లాక్ బస్టర్ అయింది. కానీ మరో వైపు మహేష్ మైలురాయి చిత్రమైన ‘మహర్షి’ మేలో విడుదల కానుంది. ఈ సినిమా పనుల్లో పడి ‘మహర్షి’ సినిమాని పక్కన పెట్టవద్దు అంటూ మహేష్ అభిమానులు దిల్ రాజును హెచ్చరిస్తున్నారు. మరి వీరి హెచ్చరికను దిల్ రాజు సీరియస్ గా తీసుకుంటారా లేదా చూడాలి.

First Published:  31 March 2019 12:33 AM GMT
Next Story