Telugu Global
Cinema & Entertainment

అల్లరోడి కెరీర్ లోనే భారీ పారితోషికం

మహర్షి సినిమాకు సంబంధించి అల్లరి నరేష్ కు కోటిన్నర పారితోషికం అందినట్టు తెలుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే అల్లరోడి కెరీర్ లోనే భారీ పారితోషికం ఇది. తను హీరోగా నటించే సినిమాలకు అటు ఇటుగా కోటి రూపాయలు తీసుకుంటాడు అల్లరి నరేష్. కొన్ని సినిమాలకు అంతకంటే తక్కువ మొత్తానికే పనిచేసిన సందర్భాలున్నాయి. సో.. మహర్షి కోసం అల్లరినరేష్ అందుకున్న మొత్తమే అతడి కెరీర్ లో బిగ్గెస్ట్ రెమ్యూనరేషన్ గా చెప్పుకోవాలి. సుడిగాడు సినిమా తర్వాత ఒక్కటంటే ఒక్క […]

అల్లరోడి కెరీర్ లోనే భారీ పారితోషికం
X

మహర్షి సినిమాకు సంబంధించి అల్లరి నరేష్ కు కోటిన్నర పారితోషికం అందినట్టు తెలుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే అల్లరోడి కెరీర్ లోనే భారీ పారితోషికం ఇది. తను హీరోగా నటించే సినిమాలకు అటు ఇటుగా కోటి రూపాయలు తీసుకుంటాడు అల్లరి నరేష్. కొన్ని సినిమాలకు అంతకంటే తక్కువ మొత్తానికే పనిచేసిన సందర్భాలున్నాయి. సో.. మహర్షి కోసం అల్లరినరేష్ అందుకున్న మొత్తమే అతడి కెరీర్ లో బిగ్గెస్ట్ రెమ్యూనరేషన్ గా చెప్పుకోవాలి.

సుడిగాడు సినిమా తర్వాత ఒక్కటంటే ఒక్క సక్సెస్ కూడా అందుకోలేకపోయాడు అల్లరి నరేష్. అదే టైమ్ లో మహర్షి మూవీ ఆఫర్ వచ్చింది. మహేష్ సినిమా కావడం, క్యారెక్టర్ నచ్చడం, పైగా పారితోషికం కూడా ఎక్కువగా ఉండడంతో వెంటనే ఒప్పుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయితే హీరోగా కూడా మార్కెట్ పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు అల్లరోడు.

మహర్షి సినిమాతో పాటు గిరి డైరక్షన్ లో ఓ సినిమా కంప్లీట్ చేశాడు అల్లరినరేష్. గతంలో నందిని నర్సింగ్ హోం అనే సినిమాను డైరక్ట్ చేసిన గిరి, తన రెండో ప్రయత్నంగా అల్లరినరేష్ తో కామెడీ ఎంటర్ టైనర్ తీశాడు. మహర్షి తర్వాత థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాతో హీరోగా కూడా సక్సెస్ అవ్వాలనుకుంటున్నాడు అల్లరినరేష్.

First Published:  31 March 2019 8:11 AM GMT
Next Story