Telugu Global
NEWS

వెంకటేశ్వర రావుకు సమాచారం ఇస్తూ దొరికిన అధికారులు

ఇంటెలిజెన్స్ డీజీ పదవి నుంచి ఏబీ వెంకటేశ్వరరావును ఈసీ తప్పించినా… హైకోర్టు కూడా ఈసీ నిర్ణయాన్ని సమర్ధించినా… చంద్రబాబు ప్రభుత్వ తీరు మాత్రం మారలేదు. ఇప్పటికే ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ వ్యవహారాలను పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌లోని అధికారులు ఇప్పటికీ ఏబీ కే రిపోర్టులు అందజేస్తున్నారు. రాజకీయ పరమైన, ఎన్నికలకు సంబంధించిన వివరాలను ఏబీ వెంకటేశ్వర రావుకే అధికారులు రిపోర్టు చేస్తున్నారు. దీనిపై వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఇద్దరు అధికారులు ఏబీ వెంకటేశ్వరరావుకు రిపోర్టు చేసిన సాక్ష్యాలను కూడా సేకరించి వాటిని ఈసీకి అందజేసింది. కొత్త […]

వెంకటేశ్వర రావుకు సమాచారం ఇస్తూ దొరికిన అధికారులు
X

ఇంటెలిజెన్స్ డీజీ పదవి నుంచి ఏబీ వెంకటేశ్వరరావును ఈసీ తప్పించినా… హైకోర్టు కూడా ఈసీ నిర్ణయాన్ని సమర్ధించినా… చంద్రబాబు ప్రభుత్వ తీరు మాత్రం మారలేదు.

ఇప్పటికే ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ వ్యవహారాలను పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌లోని
అధికారులు ఇప్పటికీ ఏబీ కే రిపోర్టులు అందజేస్తున్నారు. రాజకీయ పరమైన, ఎన్నికలకు సంబంధించిన వివరాలను ఏబీ వెంకటేశ్వర రావుకే అధికారులు రిపోర్టు చేస్తున్నారు.

దీనిపై వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఇద్దరు అధికారులు ఏబీ వెంకటేశ్వరరావుకు రిపోర్టు చేసిన సాక్ష్యాలను కూడా సేకరించి వాటిని ఈసీకి అందజేసింది. కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్‌ను నియమించినా కొందరు అధికారులు ఇప్పటికీ ఏబీ వెంకటేశ్వర రావుకే రిపోర్టు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలతో సహా ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది.

First Published:  31 March 2019 10:57 AM GMT
Next Story