Telugu Global
Cinema & Entertainment

విక్కీ కౌశల్‌ తో డేటింగ్ కి రెడీ అంటున్న తమన్నా

చేతిలో అరడజను సినిమాలతో నిమిషం తీరిక లేకుండా గడిపేస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈమధ్యనే ‘ఎఫ్ 2’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఒక ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. విలేకరి ప్రశ్నలకు చాలా ఆసక్తికరమైన జవాబులిచ్చింది ఈ బ్యూటీ. డేటింగ్‌కి వెళ్లాల్సి వస్తే ఏ హీరో తో వెళ్తారు? అని అడగగా తమన్నా వెంటనే విక్కీ కౌశల్‌ పేరు చెప్పేసింది. అంతే కాక ‘ఉరీ: ది సర్జికల్‌ స్ట్రయిక్‌’ సినిమాలో విక్కీ నటనకు […]

విక్కీ కౌశల్‌ తో డేటింగ్ కి రెడీ అంటున్న తమన్నా
X

చేతిలో అరడజను సినిమాలతో నిమిషం తీరిక లేకుండా గడిపేస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈమధ్యనే ‘ఎఫ్ 2’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఒక ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. విలేకరి ప్రశ్నలకు చాలా ఆసక్తికరమైన జవాబులిచ్చింది ఈ బ్యూటీ.

డేటింగ్‌కి వెళ్లాల్సి వస్తే ఏ హీరో తో వెళ్తారు? అని అడగగా తమన్నా వెంటనే విక్కీ కౌశల్‌ పేరు చెప్పేసింది. అంతే కాక ‘ఉరీ: ది సర్జికల్‌ స్ట్రయిక్‌’ సినిమాలో విక్కీ నటనకు ఫిదా అయ్యానని చెప్పింది. ఈ ఇంటర్వ్యూలో మీటూ ఉద్యమం గురించి మాట్లాడింది తమన్నా.

“ఎవరెవరో ఏవేవో ఆరోపణలు చేస్తుంటారు. కానీ తమకు ఎదురైన అనుభవాల గురించి చర్చించుకోవడానికే మీటూ ఉద్యమం ఉంది. వాటి గురించి మాట్లాడాలంటే చాలా ధైర్యం ఉండాలి. కానీ ఇప్పుడు ఇదేదో ఆటలా మారిపోయిందని అనిపిస్తోంది. అందరూ ఈ ఉద్యమాన్ని సీరియస్‌గా తీసుకుని ఉంటే చిత్ర పరిశ్రమలో ఎలాంటి మార్పులు చూడాలనుకుంటున్నామో అవి వచ్చేవి’ అని పెదవి విరిచింది తమన్నా.

సినిమాల పరంగా చూస్తే ప్రస్తుతం ఆమె ‘అభినేత్రి 2’, ‘దటీజ్‌ మహాలక్ష్మి’, ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలతో బిజీగా ఉంది. అటు తమిళంలో కూడా ఈమె చేతిలో బాగానే సినిమాలున్నాయి.

First Published:  28 March 2019 4:20 AM GMT
Next Story