Telugu Global
Cinema & Entertainment

ఆర్-ఆర్-ఆర్ హీరోయిన్లు.... ఎప్పట్నుంచి సెట్స్ పైకి?

ఆర్-ఆర్-ఆర్ సినిమాలో హీరోయిన్లు ఎవరనేది తెలిసిపోయింది. రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని బయటపెట్టాడు రాజమౌళి. రామ్ చరణ్ సరసన అలియా భట్, ఎన్టీఆర్ సరసన ఓ ఫారిన్ ముద్దుగుమ్మ నటించబోతున్నారనే విషయాన్ని బయటపెట్టారు. అయితే వీళ్లిద్దరు ఎప్పుడు సెట్స్ పైకి వస్తారనేది మొన్నటివరకు డౌట్. ఇప్పుడా సందేహానికి కూడా సమాధానం దొరికేసింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూణెలో ఓ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఈ షెడ్యూల్ లో హీరోయిన్లు అలియాభట్, […]

ఆర్-ఆర్-ఆర్ హీరోయిన్లు.... ఎప్పట్నుంచి సెట్స్ పైకి?
X

ఆర్-ఆర్-ఆర్ సినిమాలో హీరోయిన్లు ఎవరనేది తెలిసిపోయింది. రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని బయటపెట్టాడు రాజమౌళి. రామ్ చరణ్ సరసన అలియా భట్, ఎన్టీఆర్ సరసన ఓ ఫారిన్ ముద్దుగుమ్మ నటించబోతున్నారనే విషయాన్ని బయటపెట్టారు. అయితే వీళ్లిద్దరు ఎప్పుడు సెట్స్ పైకి వస్తారనేది మొన్నటివరకు డౌట్. ఇప్పుడా సందేహానికి కూడా సమాధానం దొరికేసింది.

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూణెలో ఓ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఈ షెడ్యూల్ లో హీరోయిన్లు అలియాభట్, డైసీ జోన్స్ పాల్గొంటారు. ఇదే షెడ్యూల్ లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కూడా జాయిన్ అవ్వబోతున్నారు. వీళ్ల రాకతో సినిమా షూటింగ్ మరింత ఊపందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దాదాపు 40 రోజుల భారీ షెడ్యూల్ ఇది.

1920ల నాటి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. సంగీత దర్శకుడు కీరవాణి ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేశాడు.

First Published:  28 March 2019 5:06 AM GMT
Next Story