Telugu Global
Cinema & Entertainment

బర్త్ డే విషెస్ చెప్పిన కోన.... ఘాటు కామెంట్లతో మెగా అభిమానుల అటాక్

కోన వెంకట్  సోషల్ మీడియా ద్వారా చరణ్ కు బర్త్ డే విషెస్ చెప్పాడు. “బంగారం లాంటి మనసున్న రామ్ చరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు. లాంగ్ లివ్ మెగా పవర్ స్టార్” అంటూ కోన వెంకట్ ట్వీట్ చేశాడు. ట్వీట్ చేయడం బాగానే ఉంది కానీ దాని కింద నెటిజన్లు మాత్రం చాలా ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే ఏకంగా బూతులు కూడా తిట్టేస్తున్నారు. దానికి కారణం కోన వెంకట్ పవన్ కళ్యాణ్ మరియు జనసేన […]

బర్త్ డే విషెస్ చెప్పిన కోన.... ఘాటు కామెంట్లతో మెగా అభిమానుల అటాక్
X

కోన వెంకట్ సోషల్ మీడియా ద్వారా చరణ్ కు బర్త్ డే విషెస్ చెప్పాడు. “బంగారం లాంటి మనసున్న రామ్ చరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు. లాంగ్ లివ్ మెగా పవర్ స్టార్” అంటూ కోన వెంకట్ ట్వీట్ చేశాడు.

ట్వీట్ చేయడం బాగానే ఉంది కానీ దాని కింద నెటిజన్లు మాత్రం చాలా ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే ఏకంగా బూతులు కూడా తిట్టేస్తున్నారు. దానికి కారణం కోన వెంకట్ పవన్ కళ్యాణ్ మరియు జనసేన పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేయడమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

పవన్ కల్యాణ్ తన ప్రసంగాలతో ద్వేషాలను రగిలిస్తున్నాడని, తెలంగాణలో విద్వేషాలను రగిలించి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని అన్నాడు కోన. పవన్ కు సన్నిహితుడిగా చెప్పుకునే కోన ఇలా రివర్స్ అయ్యి పవన్ పై ఘాటు విమర్శలు చేసే సరికి కోనపై మెగా అభిమానులు విరుచుకుపడుతున్నారు.

ఇప్పటికే దీనిపై కోన రెండు మూడు పేజీల్లో సుదీర్ఘ వివరణను ఇచ్చాడు కానీ ఫ్యాన్స్ మాత్రం ఇంకా అసంతృప్తిగానే ఉన్నారు.

First Published:  27 March 2019 10:54 PM GMT
Next Story